Viral Video: ఏంటీ ఈ ప్లాస్టిక్ కవర్ ధర లక్షన్నర రూపాయాలా.? వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. వీటిలో కొన్ని నిజం ఉంటే మరికొన్ని మాత్రం ఫేక్ న్యూస్ కూడా ఉంటాయి. తాజాగా ఓ వీడియో నెటిజన్లు ఎంతో ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందంటే.?
Viral Video: ఏంటీ ఈ ప్లాస్టిక్ కవర్ ధర లక్షన్నర రూపాయాలా.? వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. వీటిలో కొన్ని నిజం ఉంటే మరికొన్ని మాత్రం ఫేక్ న్యూస్ కూడా ఉంటాయి. తాజాగా ఓ వీడియో నెటిజన్లు ఎంతో ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందంటే.?
వైరల్ వీడియోలో ఏముందంటే.?
టర్కీలోని ఒక లగ్జరీ షాప్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో షాప్ యజమాని ఒక పసుపు రంగు ప్లాస్టిక్ కవర్‌ను గ్లోవ్స్ వేసుకుని చాలా జాగ్రత్తగా చూపిస్తున్నాడు. అది సాధారణ చెత్త సంచి కాదు అని చెబుతూ, అది లగ్జరీ బ్రాండ్ Balenciaga తయారు చేసిన బ్యాగ్ అని చెప్పాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
నిజంగా ఇది Balenciaga బ్యాగ్నేనా?
అయితే ఈ వీడియోలో నిజం లేదని తెలిసింది. ఈ వీడియో ఒక సర్కాస్టిక్ (వ్యంగ్య) రీల్ మాత్రమే అని తేలింది.
“Galata Luxury SAAD” అనే ఇన్స్టాగ్రామ్ పేజీ దీన్ని సరదాగా రూపొందించింది. అసలు Balenciaga బ్యాగ్ కాకుండా, సాధారణ ప్లాస్టిక్ బ్యాగ్‌ను ఉపయోగించారు. అయితే లగ్జరీ బ్యాగులకు పెట్టింది పేరైన Balenciaga కంపెనీ నిజంగానే 2022లో చెత్త సంచిలా కనిపించే లెదర్ బ్యాగ్‌ను విడుదల చేసింది.
నెటిజన్స్ ఫన్నీ రియాక్షన్స్
ఈ వీడియోపై సోషల్ మీడియాలో భారీగా కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి కవర్లను మన ఇండియాలో ఉచితంగా ఇస్తారంటూ ఒకరు కామెంట్ చేయగా.. కూరగాయలు కొనుగోలు చేస్తే ఇలాంటివే వస్తాయని మరొకరు స్పందిస్తున్నారు.
Balenciaga బ్రాండ్ గురించి
Balenciaga ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఒకటి. దీనిని 1919లో స్పెయిన్‌లో స్థాపించారు. క్రిస్టోబల్ బాలెన్సియాగా దీనిని స్థాపించారు. ఈ బ్రాండ్ ప్రత్యేకమైన, విభిన్నమైన డిజైన్స్‌కు ప్రసిద్ధి చెందింది.
సాధారణ వస్తువులను కూడా హై-ఫ్యాషన్‌గా మార్చడం వీరి స్టైల్.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న రూ. 1.5 లక్షల ట్రాష్ బ్యాగ్ నిజమా కాదా అన్నది పక్కన పెడితే, ఈ విషయం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఫ్యాషన్ ప్రపంచం రోజురోజుకీ కొత్త, విచిత్రమైన దిశలో వెళ్తోందనడానికి ఇది నిదర్శనం.




