ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్.. అల్లు సినిమాస్ ప్రత్యేకతలు ఇవే! (ఫోటోలు)

Allu Cinemas: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'అల్లు సినిమాస్' (Allu Cinemas) మల్టీప్లెక్స్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.

Arun Chilukuri
Published on: 14 March 2026 5:00 PM IST
ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్.. అల్లు సినిమాస్ ప్రత్యేకతలు ఇవే! (ఫోటోలు)
X

ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్.. అల్లు సినిమాస్ ప్రత్యేకతలు ఇవే! (ఫోటోలు)

Allu Cinemas: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'అల్లు సినిమాస్' (Allu Cinemas) మల్టీప్లెక్స్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. హైదరాబాద్‌లోని కోకాపేటలో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ మల్టీప్లెక్స్‌ను ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం నాడు థియేటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్ ఈ సినిమా హాల్‌కు ఉన్న అంతర్జాతీయ స్థాయి ప్రత్యేకతలను వివరించారు.

హైదరాబాద్‌లోనే మొట్టమొదటి 'డాల్బీ సినిమా' (Dolby Cinema) అనుభవాన్ని అల్లు సినిమాస్ అందిస్తోందని అల్లు అరవింద్ గర్వంగా ప్రకటించారు. ముఖ్యంగా ఇందులోని 'స్క్రీన్ 1' ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌గా రికార్డు సృష్టించిందని ఆయన తెలిపారు.

ఈ థియేటర్ సౌండ్ సిస్టమ్ గురించి వివరిస్తూ.. ఇందులో ఏకంగా 78 స్పీకర్లు, 165 సౌండ్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. అయితే, ఇవన్నీ బయటకు కనిపించకుండా స్క్రీన్ వెనుక మరియు గోడలలో అమర్చడం దీని ప్రత్యేకత. ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చూసి జర్మనీ నుంచి వచ్చిన టెక్నికల్ టీమ్ సైతం ఆశ్చర్యపోయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు శబ్దం ప్రతి మూల నుండి సహజంగా వినిపించేలా ఈ టెక్నాలజీని రూపొందించారు.

మొత్తానికి, కోకాపేట పరిసర ప్రాంతాల్లోని సినీ అభిమానులకు అల్లు సినిమాస్ ఒక మర్చిపోలేని థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది.



































Arun Chilukuri

Arun Chilukuri

Next Story