Bigg Boss: బిగ్ బాస్ సౌరవ్ గంగూలీ.. దాదా కొత్త గెటప్

Bigg Boss: బిగ్ బాస్ షో గురించి తెలీని వారు లేరు. అలాగే క్రికెట్ లో సౌరవ్ గంగూలీ దూకుడు మర్చిపోలేనిది. ఈ రెండూ కలిస్తే..

KVD Varma
Published on: 11 March 2026 8:14 AM IST
Bigg Boss: బిగ్ బాస్ షో గురించి తెలీని వారు లేరు. అలాగే క్రికెట్ లో సౌరవ్ గంగూలీ దూకుడు మర్చిపోలేనిది. ఈ రెండూ కలిస్తే..
X

Bigg Boss

BBigg Boss: గంగూలీ క్రికెట్ లో తిరుగులేని విజయాలు సాధించారు. క్రికెటర్ గా ఎన్నో విజయాలు ఆయన సొంతం చేసుకున్నారు. క్రికెటర్ గా ఆయనకు విశేషమైన అభిమానులున్నారు.

బిగ్ బాస్ ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులున్న రియాల్టీ షో. మన దేశంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విజయవంతంగా నడుస్తున్న ఫుల్ ఎంటరైన్మెంట్ షో.

ఇప్పుడు బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ లోకి క్రికెట్ లెజెండరీ ఎంట్రీ ఇస్తున్నారు. కంటెస్టెంట్ గా కాదండోయ్.. హోస్ట్ గా. అవును.. భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. రంగుల ప్రపంచంలో ప్రకాశించడానికి ఆయన రెడీ అయిపోయారు.

బిగ్ బాస్ బెంగాలీ వెర్షన్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ వస్తున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా, ఆయన భారతదేశపు ప్రసిద్ధ షోలో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ షో త్వరలో స్టార్ జల్షాలో ప్రసారం కానుంది.

సెలబ్రిటీలు . .

'బిగ్ బాస్' కు భారతదేశంలో భారీ మార్కెట్ ఉంది. ఎన్టీఆర్, కిచ్చా సుదీప్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, నాగార్జున, విజయ్ సేతుపతి వంటి స్టార్ నటులు దీనికి హోస్ట్‌లుగా మెరిశారు. అన్ని భాషలలో చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు దీనిని హోస్ట్ చేశారు. అయితే, క్రికెట్ రంగంలో నేపథ్యం ఉన్న వ్యక్తి బిగ్ బాస్ షోను హోస్ట్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

గంగూలీ దూకుడు . .

'బిగ్ బాస్' (Bigg Boss)లోకి భిన్నమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు వస్తారు. వారందరినీ హ్యాండిల్ చేయడం అంత సులభం కాదు. హోస్ట్ గా వ్యవహరించే వారు ఒక్కోసారి చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పైకి చూడటానికి సౌరవ్ గంగూలీ మౌనంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, క్రికెట్ గ్రౌండ్ లో ఆయన చూపించిన దూకుడు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. అందువల్ల, బిగ్ బాస్ హోస్ట్ చేయడానికి గంగూలీ కరెక్ట్ గా సరిపోతారని ఈ వార్త విన్న అందరూ అభిప్రాయపడుతున్నారు.

వివిధ భాషల్లో . .

బిగ్ బాస్ షో ప్రతి సంవత్సరం కన్నడ, హిందీ, తెలుగు, తమిళ భాషలలో వస్తుంది. తెలుగులో బిగ్ బాస్ 2017లో స్టార్ట్ అయింది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. అప్పటి నుంచి తెలుగులో షో నడుస్తూనే ఉంది. తరువాత నాగార్జున దీనికి హోస్ట్ గా వచ్చారు. ఇప్పుడు కూడా ఆయనే హోస్ట్ గా ఉన్నారు. ఇక కన్నడలో మొదటి సీజన్ 2013లో ప్రారంభమైంది. అ డ ఇప్పటికే 12 సీజన్లు పూర్తయ్యాయి. అయితే, బెంగాలీలో మొదటి సీజన్ కూడా 2013లో ప్రారంభం అయింది. మిథున్ చక్రవర్తి హోస్ట్‌గా చేశారు. దీని రెండవ సీజన్ 2016లో ప్రసారం అయింది. ఆ సీజన్ లో జీత్ హోస్ట్‌గా ఉన్నారు. అయితే, రెండు సీజన్‌లు పెద్దగా విజయవంతం కాలేదు. అందుకే, బిగ్ బాస్ అక్కడ తరువాత ఆగిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత, ఈ షో బెంగాలీలో స్టార్ట్ కాబోతోంది. పైగా సౌరవ్ గంగూలీ వంటి క్రికెట్ లెజెండరీ హోస్ట్ గా వస్తున్నారు. మరి ఈసారి బెంగాలీలో షో సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.

KVD Varma

KVD Varma

Next Story