Nellore: హరినాధపురంలో భక్తి పారవశ్యం.. బ్రహ్మేశ్వరాలయానికి రాజగోపురం!


Nellore: హరినాధపురంలో భక్తి పారవశ్యం.. బ్రహ్మేశ్వరాలయానికి రాజగోపురం!
Nellore: నెల్లూరు హరినాధపురం బ్రహ్మేశ్వరాలయంలో నూతన రాజగోపుర కలశ ప్రతిష్టాపన! ఈనెల 10 నుండి 12 వరకు జరిగే యజ్ఞయాగాదులు మరియు మహా కుంభాభిషేక మహోత్సవం పూర్తి వివరాలు.
Nellore: హరనాధపురంలోని బ్రహ్మేశ్వరాలయంలో నూతన రాజగోపుర కలశ ప్రతిష్టకు ఈనెల 12న ముహూర్తం ఖరారు చేసిన సందర్భంగా
నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..
2019లో శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతి సమేత బ్రహ్మేశ్వరాలయం వేదమూర్తుల చేతుల మీదుగా దాతల సహకారంతో ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగిందని, అటు తర్వాత నిత్య పూజలు, అభిషేకాలు అందుకుంటున్న స్వామివారికి నిత్యం ధూప దీప నైవేద్యాలతో పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు, కార్తీక మాస ఉత్సవాలను గత ఏడు సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
అలాగే ఆలయం అతి తక్కువ కాలంలోనే దినదినాభివృద్ధి చెందుతూ హరనాధపురం గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారని చెప్పారు. ఈ ఏడాది ముఖ్యంగా స్వామివారి ఆలయ రాజగోపుర శిఖర కలిసా ప్రతిష్టాపన, మహా కుంభాభిషేక మహోత్సవానికి నిర్వహించాలని సంకల్పించామని, ఆ స్వామివారి ఆశీస్సులతో దైవజ్ఞులు సుముహూర్తాన్ని నిర్ణయించారని తెలిపారు.
ఈ నెల 10వ తారీకు నుండి మూడు రోజులపాటు ప్రతిష్టాపన మహోత్సవాలకు సంబంధించి యాగాలు, యజ్ఞాలు, నిర్వహించనున్నామని తెలిపారు. అదేవిధంగా ఈనెల 12వ తారీఖున ఉదయం 6 గంటల నుండి 7.41 లోగా జగద్గురువులు శ్రీ కంచి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి మహా స్వామి వారి దివ్య ఆశీస్సులతో వారి అనుగ్రహ భూషణాలతో వారి ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఆదేశాల మేరకు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి నేతృత్వంలో , నూతన రాజ గోపుర కలశ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కమిటీ సభ్యులు, దాతలు స్థానికుల అందరి సహకారంతో పూర్తి చేయడం జరిగిందని చెప్పారు.. ఈ నూతన రాజగోపుర కలశ ప్రతిష్టాపన కార్యక్రమానికి కంచి ఆస్థాన సిద్ధాంతి శ్రీ విజయ సుబ్రమణ్యేశ్వర సిద్ధాంతి, ఆయన శిష్య బృందంతో కలిసి విచ్చేసి మహా కుంభాభిషేక ప్రతిష్టాపన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారని తెలిపారు..భక్తులు గ్రామస్తులు పెద్ద ఎత్తున విచ్చేసి మహా కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నానని తెలిపారు... ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దాతలు ,నిర్వాహకులు అర్చక స్వాములు పాల్గొన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

