Supreme Court: మతం మారితే ఎస్సీ హోదా కట్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Supreme Court: దేశంలో మత మార్పిడులు, రిజర్వేషన్ల వర్తింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
Supreme Court: మతం మారితే ఎస్సీ హోదా కట్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Supreme Court: దేశంలో మత మార్పిడులు, రిజర్వేషన్ల వర్తింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. షెడ్యూల్డ్ కులాల (SC) వారు ఇతర మతాల్లోకి మారినట్లయితే, వారికి ఉన్న ఎస్సీ హోదా తక్షణమే రద్దవుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లో కొనసాగే వారికి లేదా ఆ మతాల్లోకి మారే వారికి మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. ఇవి కాకుండా ఇతర మతాలైన క్రైస్తవం లేదా ఇస్లాం వంటి మతాల్లోకి మారితే, సామాజికంగా వారు ఎస్సీ వర్గంగా పరిగణించబడరని ధర్మాసనం వివరించింది.
ఒక వ్యక్తి ఎస్సీ వర్గానికి చెందినవాడైనప్పటికీ, మతం మార్చుకున్న మరుక్షణమే ఆయనకు దక్కే రిజర్వేషన్లు మరియు ఎస్సీ హోదా రద్దవుతాయి. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి (పాస్టర్ అయినా సరే), ఆ తర్వాత తనపై జరిగిన దాడులు లేదా ఇతర అంశాల్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందలేరని కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఇదే అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
ఈ తీర్పు దేశవ్యాప్తంగా మత మార్పిడుల అంశంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా రిజర్వేషన్లు అనుభవిస్తూ ఇతర మతాలను ఆచరిస్తున్న వారిపై ఈ తీర్పు ప్రభావం చూపనుంది. క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీ హోదాను కోరడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసినట్లయింది.




