Reliance Jio IPO: జియో 'మెగా ఐపీఓ'కు రంగం సిద్ధం.. ఈ నెలాఖరునే కీలక అడుగు!

Reliance Jio IPO: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని జియో ప్లాట్‌ఫామ్ 'మెగా ఐపీఓ' కోసం ముమ్మరంగా సిద్ధమవుతోంది. 17 మంది అంతర్జాతీయ బ్యాంకర్ల భాగస్వామ్యంతో ఈ నెలాఖరులోగా DRHP దాఖలు చేసే అవకాశం ఉంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూడండి.

Ganesh
Published on: 18 March 2026 4:19 PM IST
Reliance Jio IPO
X

Reliance Jio IPO: జియో 'మెగా ఐపీఓ'కు రంగం సిద్ధం.. ఈ నెలాఖరునే కీలక అడుగు!

Reliance Jio IPO: భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ (IPO) దిశగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగంగా అడుగులు వేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన టెలికాం విభాగం 'జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్'ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. తాజా నివేదికల ప్రకారం.. ఈ నెలాఖరులోగా సెబీకి (SEBI) డ్రాఫ్ట్ పేపర్లను (DRHP) సమర్పించే అవకాశం ఉంది.

17 మంది గ్లోబల్ బ్యాంకర్లతో భారీ వ్యూహం

ఈ భారీ ఇష్యూను విజయవంతం చేసేందుకు రిలయన్స్ ఏకంగా 17 మంది అంతర్జాతీయ, దేశీయ బ్యాంకర్లను నియమించింది. ఇందులో 9 అంతర్జాతీయ బ్యాంకులు, 8 దేశీయ ఆర్థిక సంస్థలు ఉన్నాయి. మోర్గాన్ స్టాన్లీ, జెపిమోర్గాన్ చేజ్, గోల్డ్‌మన్ సాక్స్, సిటీగ్రూప్, హెచ్‌ఎస్‌బిసి వంటి అంతర్జాతీయ బ్యాంకులు, ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్స్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, జెఎం ఫైనాన్షియల్ వంటి దేశీయ బ్యాంకులు ఉన్నాయి.

కలిసి రానున్న ప్రభుత్వ నిబంధనలు..

పెద్ద కంపెనీలు ఐపీఓకి వచ్చేటప్పుడు తమ ఈక్విటీలో కేవలం 2.5% మాత్రమే విక్రయించేలా ప్రభుత్వం నిబంధనలను సడలించడం రిలయన్స్‌కు కలిసిరానుంది. ఈ మార్పు వల్ల జియో వంటి భారీ విలువ కలిగిన సంస్థ మార్కెట్లోకి రావడం సులభతరమైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అంబానీ గ్రూప్ నుంచి వస్తున్న మొదటి ప్రధాన ఐపీఓ ఇదే కావడం విశేషం. ఈ ఐపీఓలో ప్రధానంగా ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించే (Secondary Sale) అవకాశం ఉంది. అంతా సనుకూలంగా జరిగితే, ఈ ఏడాది చివరి నాటికి సామాన్య ఇన్వెస్టర్లకు జియో షేర్లను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

Ganesh

Ganesh

Next Story