PM Modi Assam Tour: అసోం పర్యటనలో మోడీ.. రూ.47,600 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
PM Modi Assam Tour: ప్రధాని నరేంద్ర మోడీ అసోం పర్యటనలో రూ.47,600 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పీఎం కిసాన్ 22వ విడతగా రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు జమ చేయనున్నారు.
PM Modi Assam Tour: అసోం పర్యటనలో మోడీ.. రూ.47,600 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
PM Modi Assam Tour: ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు అసోం రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం రూ.47,600 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం ఈ పర్యటనలో ప్రధాన అంశంగా నిలిచింది.
ఈ టూర్లో భాగంగా ప్రధాని మోడీ 22వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు నేరుగా జమ చేయనున్నారు.
అసోంలోని కోక్రాజర్ ప్రాంతంలో రూ.4,570 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం గౌహతిలో రూ.19,480 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
రేపు సిల్చార్లో రూ.23,550 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా రూ.3,200 కోట్లకు పైగా విలువైన ప్రధాన రహదారి ప్రాజెక్టులకు భూమిపూజ నిర్వహించనున్నారు.
ఈ ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు జాతీయ రహదారులు, గ్రామీణ రహదారుల మధ్య సంబంధాలను బలోపేతం చేయనున్నాయని అధికారులు చెబుతున్నారు.




