Nita Ambani : 40 వేల మంది గిరిజన బిడ్డల సాక్షిగా నీతా అంబానీకి దక్కిన అరుదైన గౌరవం

Nita Ambani : నీతా అంబానీకి ఒడిశాలో ప్రతిష్టాత్మక హ్యూమానిటేరియన్ అవార్డు లభించింది. సింపుల్ మెరూన్ చీరలో మెరిసిన ఆమె, 40 వేల మంది విద్యార్థుల సాక్షిగా సామాజిక సేవపై తన నిబద్ధతను చాటుకున్నారు.

CR Reddy
Updated on: 19 March 2026 6:49 AM IST
Nita Ambani
X

Nita Ambani

Nita Ambani : రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ సామాజిక సేవా రంగంలో చేస్తున్న కృషికి గాను తాజాగా KISS హ్యూమానిటేరియన్ అవార్డు 2025 లభించింది. భువనేశ్వర్‌లోని కిట్ యూనివర్సిటీలో జరిగిన ఈ వేడుకలో KISS వ్యవస్థాపకులు డాక్టర్ అచ్యుత సమంత ఆమెను ఘనంగా సత్కరించారు. విద్య, వైద్యం, క్రీడలు, గ్రామీణాభివృద్ధి రంగాలలో నీతా అంబానీ చూపిస్తున్న చొరవ లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఈ సందర్భంగా సంస్థ ప్రశంసించింది. ఈ అవార్డును అందుకున్న నీతా అంబానీ, 40 వేల మంది గిరిజన విద్యార్థుల మధ్య ఉండటం తనకి గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

అబ్బురపరిచిన నీతా అంబానీ ఫ్యాషన్ లుక్

సాధారణంగా భారీ నగలు, ఖరీదైన పట్టుచీరల్లో కనిపించే నీతా అంబానీ, ఈ వేడుక కోసం చాలా సింపుల్ లుక్ సెలక్ట్ చేసుకున్నారు. ఆమె ధరించిన మెరూన్ కలర్ సిల్క్ చీర అందరినీ ఆకట్టుకుంది. ఆ చీరపై ప్రకృతికి సంబంధించిన బ్లాక్ ప్రింట్ డిజైన్ ఉండగా, గ్రీన్ కలర్ బోర్డర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ ధరించి, ఎంతో హుందాగా కనిపించారు. ఆమె ఆహార్యం చూసిన వారంతా సింప్లిసిటీలోనే అసలైన అందం ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


తక్కువ నగలు.. ఎక్కువ మెరుపు

ఈసారి ఆమె నగలు కూడా చాలా పరిమితంగానే పెట్టుకున్నారు. చెవులకు రూబీ, డైమండ్ హ్యాంగింగ్స్, చేతికి పెద్ద సైజు డైమండ్ రింగ్, ఆకుపచ్చ గాజులు, మెడలో గోల్డ్ బీడెడ్ నెక్లెస్‌తో తన లుక్‌ను కంప్లీట్ చేశారు. జుట్టును చక్కగా ముడి వేసి మల్లెపూలు పెట్టుకోవడం ఆమెకు మరింత నిండుదనాన్ని ఇచ్చింది. నుదుటన చిన్న బిందీ, కళ్లకు కాటుకతో సాంప్రదాయ బద్ధంగా మెరిసిపోయారు. ఈ వేడుకలో ఆమె చేసిన ప్రసంగం ముఖ్యంగా బాలికలకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. అబ్బాయిలు సాధించేది ఏదైనా అమ్మాయిలు కూడా సాధించగలరని ఆమె పిలుపునిచ్చారు.

CR Reddy

CR Reddy

Next Story