Nayanthara: నయనతారపై ఎంపీ అసభ్య వ్యాఖ్యలు..సెగలు రేపుతున్న పొలిటికల్ కామెంట్స్
AIADMK MP: రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజం. కానీ, ఆ విమర్శల కోసం ఒక మహిళా నటిని, అందులోనూ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారను వివాదాల్లోకి లాగడం ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. మహిళల భద్రత కోసం నిరసనలు చేస్తున్న ఒక రాజకీయ పార్టీ ఎంపీయే.. ఒక మహిళా నటిపై బహిరంగంగా వెకిలి వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.

అసలేం జరిగిందంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. "మీ కలలను నాతో పంచుకోండి, వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది" అని పిలుపునిచ్చారు. దీనిపై విమర్శలు గుప్పించే క్రమంలో అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం హద్దులు దాటారు. అబ్దుల్ కలాం గారు మనల్ని కలలు కనమన్నారు.. స్టాలిన్ కూడా కలలు పంచుకోమంటున్నారు. ఒకవేళ నాకు నయనతార కావాలని కల వస్తే, స్టాలిన్ నా కోరిక తీరుస్తారా? ఎవరైనా వెళ్లి తమకు నయనతారతో పెళ్లి చేయమని అడిగితే ఆయన ఆ కల నెరవేరుస్తారా? అంటూ వెటకారంగా వ్యాఖ్యానించారు. మహిళల రక్షణ కోసం చేపట్టిన నిరసన ప్రదర్శనలోనే ఒక స్టార్ హీరోయిన్ గురించి ఇంత దారుణంగా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నడిగర సంఘం ఆగ్రహం.. లీగల్ వార్నింగ్
నయనతారపై చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలను తమిళ చిత్ర పరిశ్రమ ఏకగ్రీవంగా ఖండించింది. నటీనటుల నడిగర సంఘం ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది.బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వెకిలి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. సినీ తారలను సాకుగా చూపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించింది. ఎంపీ షణ్ముగం వెంటనే నయనతారకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కోలీవుడ్‌లో నటీమణులపై రాజకీయ నేతలు నోరు పారేసుకోవడం ఇది మొదటిసారి కాదు. కొద్దిరోజుల క్రితం నటి త్రిషపై కూడా ఒక నేత ఇలాగే అసభ్యకర వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు నయనతారను లక్ష్యంగా చేసుకోవడం చూస్తుంటే.. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి ఏమీ దొరకనప్పుడే, ఇలా హీరోయిన్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విశ్లేషకులు మండిపడుతున్నారు.