Delhi: ఢిల్లీలో ఎంపీ బైరెడ్డి శబరిని కలిసిన సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు
Delhi: న్యూ ఢిల్లీలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
Delhi: ఢిల్లీలో ఎంపీ బైరెడ్డి శబరిని కలిసిన సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు
Delhi: న్యూ ఢిల్లీలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరిని ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
మంగళవారం ఆమె నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు రిటైర్డ్ ఐజీలు, ఏడీజీలు, సీఐఎస్‌ఎఫ్ డీఐజీ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు తమ సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి వివరించారు. ఫోర్సెస్ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సంక్షేమ చర్యల అవసరంపై ఆమె దృష్టికి తీసుకువచ్చారు.ఈ అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన విధాన మార్పుల కోసం పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఫోర్సెస్ సంక్షేమానికి సంబంధించిన అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించనున్నట్లు ఎంపీ హామీ ఇవ్వడంతో, ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.




