Mamata Banerjee Net Worth: మమతా బెనర్జీ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Mamata Banerjee Net Worth: దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకురాలిగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు మమతా బెనర్జీ.

Arun Chilukuri
Published on: 18 March 2026 11:33 AM IST
Mamata Banerjee Net Worth
X

Mamata Banerjee Net Worth: మమతా బెనర్జీ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Mamata Banerjee Net Worth: దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకురాలిగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు మమతా బెనర్జీ. అయితే, ఆమె వ్యక్తిగత ఆస్తుల వివరాలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సాధారణ జీవితాన్ని గడిపే 'దీదీ' ఆర్థిక పరిస్థితిపై ఆసక్తికర కథనం మీకోసం..

అఫిడవిట్ ప్రకారం ఆస్తుల విలువ:

2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అధికారిక అఫిడవిట్ ప్రకారం.. మమతా బెనర్జీ మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ. 16.7 లక్షలు మాత్రమే. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం విశేషం. మరీ ముఖ్యంగా ఆమెకు ఎలాంటి అప్పులు (Debts) లేవని అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఆస్తుల విభజన ఇలా:

ఆమె వద్ద ఉన్న చేతి నగదు సుమారు రూ. 69 వేలు. వివిధ బ్యాంకుల్లో కలిపి రూ. 13.5 లక్షలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఆభరణాల విషయానికొస్తే.. ఆమె వద్ద కేవలం 9 గ్రాముల బంగారం మాత్రమే ఉంది (దీని విలువ సుమారు రూ. 43 వేలు). నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు మరియు కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఉన్నాయి.

ఆదాయ వనరులు మరియు జీతం:

ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీకి నెలకు సుమారు రూ. 2.1 లక్షల వరకు వేతనం అందుతుంది. దీనితో పాటు అధికారిక నివాసం, భద్రత, వైద్య సదుపాయాలు వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉంటాయి. అయితే, వ్యక్తిగత ఆదాయం విషయానికి వస్తే.. ఆమె రాసిన పుస్తకాలకు వచ్చే రాయల్టీ, బ్యాంక్ వడ్డీయే ప్రధాన వనరులు. ఏళ్ల తరబడి ఆమె తన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో ఈ వివరాలనే క్రమంగా వెల్లడిస్తూ వస్తున్నారు.

ప్రజాక్షేత్రంలో అగ్నిపర్వతంలా కనిపించే మమతా బెనర్జీ, వ్యక్తిగత ఆస్తుల విషయంలో ఇంత సాధారణంగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story