మమ్మల్ని ప్రేమించి.. మోడీని పెళ్లి చేసుకున్నారు! రాజ్యసభలో ఖర్గే చమత్కారం.. నవ్వు ఆపుకోలేకపోయిన ప్రధాని!

Mallikarjun Kharge: రాజ్యసభలో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తే సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తన చమత్కారంతో నవ్వులు పూయించారు.

Arun Chilukuri
Published on: 18 March 2026 3:15 PM IST
Mallikarjun Kharge
X

మమ్మల్ని ప్రేమించి.. మోడీని పెళ్లి చేసుకున్నారు! రాజ్యసభలో ఖర్గే చమత్కారం.. నవ్వు ఆపుకోలేకపోయిన ప్రధాని!

Mallikarjun Kharge: రాజ్యసభలో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తే సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తన చమత్కారంతో నవ్వులు పూయించారు. రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా చేసిన వీడ్కోలు ప్రసంగంలో ఖర్గే.. మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మరియు ప్రధాని నరేంద్ర మోడీల పొత్తుపై చేసిన వ్యాఖ్యలు సభను ఉర్రూతలూగించాయి.

54 ఏళ్ల అనుబంధం - ప్రేమ.. పెళ్లి!

దేవెగౌడతో తనకు ఉన్న 54 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఖర్గే, రాజకీయ పొత్తుల గురించి ఒక సరదా పోలికను చెప్పారు. "దేవెగౌడ గారు గత ఐదు దశాబ్దాలుగా నాకు తెలుసు. ఆయన మాతో (కాంగ్రెస్‌తో) కలిసి పనిచేశారు, మాతో డేటింగ్ చేశారు, మమ్మల్ని ప్రేమించారు.. కానీ చివరకు ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, ఇప్పుడు ప్రధాని మోడీని పెళ్లి చేసుకున్నారు" అంటూ చమత్కరించారు.

నవ్వు ఆపుకోలేకపోయిన మోడీ:

ఖర్గే చేసిన ఈ 'ప్రేమ-పెళ్లి' కామెంట్‌తో సభ ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. ప్రతిపక్ష నేత టైమింగ్ చూసి ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన నవ్వును ఆపుకోలేకపోయారు. ట్రెజరీ బెంచీలతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా బల్లలు చరుస్తూ ఖర్గే చమత్కారాన్ని ఆస్వాదించారు. దేవెగౌడ కూడా ఖర్గే వ్యాఖ్యలకు చిరునవ్వు చిందించడం విశేషం.

రాజకీయాల్లో సిద్ధాంతాలు వేరైనా, వ్యక్తిగత గౌరవం మరియు ఇలాంటి హాస్యభరిత సంభాషణలు ప్రజాస్వామ్యానికి అందాన్నిస్తాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఖర్గే తన ప్రసంగం ముగిస్తూ, సభలో తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story