Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో ‘ఎంపీ’ల సెగ: అసెంబ్లీ బరిలో దిగేది ఎవరు? తప్పుకునేది ఎవరు?

Kerala Assembly Elections 2026: కేరళ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే ఆ రాష్ట్ర రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 14 March 2026 5:11 PM IST
Kerala Assembly Elections 2026:  కేరళ కాంగ్రెస్‌లో ‘ఎంపీ’ల సెగ: అసెంబ్లీ బరిలో దిగేది ఎవరు? తప్పుకునేది ఎవరు?
X

Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో ‘ఎంపీ’ల సెగ: అసెంబ్లీ బరిలో దిగేది ఎవరు? తప్పుకునేది ఎవరు?

తిరువనంతపురం: 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే ఆ రాష్ట్ర రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎంపీల పోటీపై జరుగుతున్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సిట్టింగ్ ఎంపీలు అసెంబ్లీ బరిలో దిగాలా వద్దా అనే అంశంపై పార్టీ లోపల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైకమాండ్ చేతిలో ఎంపీల భవితవ్యం

అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలను పోటీకి దూరంగా ఉంచాలని కాంగ్రెస్ నాయకత్వం ప్రాథమికంగా భావిస్తోంది. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం (మార్చి 14, 2026) స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం పార్టీ హైకమాండ్ తీసుకుంటుందని, కేవలం గెలుపు గుర్రాలకే (Winnability) ప్రాధాన్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

నేను పోటీ చేస్తా: కె. సుధాకరన్ ధీమా

పార్టీ విధానం ఎలా ఉన్నప్పటికీ, కేరళ కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ కె. సుధాకరన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాను కన్నూర్ నుండి 100 శాతం అసెంబ్లీ బరిలో ఉంటానని ఆయన ప్రకటించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆయనతో పాటు మరికొందరు ఎంపీలు కూడా రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపుతుండటంతో స్క్రీనింగ్ కమిటీకి తలనొప్పిగా మారింది.

బీజేపీ గ్లామర్ వ్యూహం

మరోవైపు, ఈసారి కేరళలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. ప్రముఖులతో పాటు సినీ గ్లామర్‌ను వాడుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ నటీమణులు శోభన, శ్వేతా మీనన్లను రంగంలోకి దించేలా కసరత్తు చేస్తోంది. వీరి రాకతో తటస్థ ఓటర్లను ఆకర్షించవచ్చని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి కేరళ అసెంబ్లీ పోరు అటు అనుభవజ్ఞులైన ఎంపీలు, ఇటు గ్లామరస్ సినీ తారల మధ్య రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story