Vishwanath & Sons Teaser: సూర్య 'విశ్వనాథ్ & సన్స్' టీజర్ డేట్ ఫిక్స్.. బ్లాస్టింగ్ అప్‌డేట్ అప్పుడే!

Vishwanath & Sons Teaser: సూర్య 'విశ్వనాథ్ & సన్స్' టీజర్ డేట్ వచ్చేసింది! దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ టీజర్‌ను మార్చి 16న విడుదల చేయనున్నారు. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ టైమింగ్, జూలై రిలీజ్ విశేషాలు ఈ స్టోరీలో చూడండి.

Ganesh
Updated on: 14 March 2026 7:54 PM IST
Vishwanath & Sons Teaser
X

Vishwanath & Sons Teaser: సూర్య 'విశ్వనాథ్ & సన్స్' టీజర్ డేట్ ఫిక్స్.. బ్లాస్టింగ్ అప్‌డేట్ అప్పుడే!

Vishwanath & Sons Teaser: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ అప్‌డేట్‌ను ఇస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో ఒక సాలిడ్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ సినిమా టీజర్‌ను మార్చి 16న సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

వెంకీ అట్లూరి మార్క్ మ్యాజిక్..

'సార్', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న వెంకీ అట్లూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. జూలైలో ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 16వ తేదీన రాబోయే టీజర్‌తో సినిమా కథాంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




Ganesh

Ganesh

Next Story