Virosh Honeymoon: విజయ్-రష్మిక హనీమూన్ ఫోటో వైరల్..థాయ్‌లాండ్‌లో కొత్త జంట

Virosh Honeymoon: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హనీమూన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థాయ్‌లాండ్ ద్వీపంలో ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారు.

KVD Varma
Published on: 22 March 2026 3:10 PM IST
Virosh Honeymoon: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హనీమూన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
X

Virosh Honeymoon

Virosh Honeymoon: దక్షిణాది సెలబ్రిటీలు రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లారు. ఈ నూతన దంపతుల హనీమూన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది . ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న తర్వాత, ఈ జంట థాయ్‌లాండ్‌కు వెళ్లారు . వారు అక్కడ ఒక అందమైన ద్వీపంలో సమయం గడుపుతున్నారు. తమ ప్రైవసీ కోసం వారు లక్సరీ రిసార్ట్ బదులు ఒక ప్రైవేట్ వీళ్ళలో బస చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో, విజయ్, రష్మిక ప్రకృతి అందాల మధ్యలో ఒక అందమైన మెట్లపై ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ కనిపిస్తున్నారు. పసుపు రంగు పూల దుస్తులలో రష్మిక ప్రకాశవంతంగా ఉండగా, విజయ్ సాధారణ టీ-షర్ట్, ప్యాంటు ధరించి ఉన్నాడు. ఈ ఫోటో వైరల్ అయ్యింది.

"వారు బస చేస్తున్న విల్లా సముద్రానికి అభిముఖంగా ఉండి, చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంది. వారి పెళ్లిలాగే, వారి హనీమూన్ కూడా వారి నిరాడంబరతకు, వ్యక్తిగత అభిరుచులకు నిదర్శనంగా నిలుస్తోంది," అని వారికి సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ మీడియా రిపోర్టులు వస్తున్నాయి. వైరల్ అయిన ఆ ఫోటోపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.



Virosh Honeymoon: ఈ జంట ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఒక విలాసవంతమైన హోటల్‌లో వివాహం చేసుకున్నారు. విజయ్ తెలుగు సంప్రదాయాలు, రష్మిక కొడగు కొడవ సంప్రదాయాల మేళవింపుతో ఈ వివాహ వేడుక ఆహ్లాదకర వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వివాహ ఫోటోలు ఇప్పటికే అభిమానుల మనసులను గెలుచుకున్నాయి.

వైరల్ అయిన జంట హనీమూన్ ఫోటోపై అభిమానులు 'ఒకరికొకరు పుట్టారు' అని కామెంట్ చేస్తూ, ఆ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 'రణబలి' మూవీలో కలిసి నటిస్తున్నారు. అభిమానులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

KVD Varma

KVD Varma

Next Story