ఆసక్తిరేపుతున్న ప్రియదర్శి 'సుయోధన' టీజర్.. డైలాగ్ కింగ్ సాయికుమార్ పవర్‌ఫుల్ రోల్!

Suryodhana Movie Teaser Launch: ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై వై.ఎస్. మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైవిధ్యభరిత చిత్రం "సుయోధన".

Arun Chilukuri
Published on: 15 March 2026 5:49 PM IST
ఆసక్తిరేపుతున్న ప్రియదర్శి సుయోధన టీజర్.. డైలాగ్ కింగ్ సాయికుమార్ పవర్‌ఫుల్ రోల్!
X

ఆసక్తిరేపుతున్న ప్రియదర్శి 'సుయోధన' టీజర్.. డైలాగ్ కింగ్ సాయికుమార్ పవర్‌ఫుల్ రోల్!

Suryodhana Movie Teaser Launch: ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై వై.ఎస్. మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైవిధ్యభరిత చిత్రం "సుయోధన". ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ నటి ప్రేమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బోసుబాబు నిడుమోలు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.

సైకలాజికల్ థ్రిల్లర్‌గా 'సుయోధన'

ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. "ఇదొక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక మనిషిని సుయోధన అని ఎందుకు అంటారు, దుర్యోధన అని ఎందుకు పిలుస్తారు అనే పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. సాయికుమార్ గారితో కలిసి నటించడం ఒక గొప్ప అనుభవం. నిర్మాత బోసుబాబు గారు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను నిర్మించారు" అని తెలిపారు.

సాయికుమార్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్

నటుడు సాయికుమార్ మాట్లాడుతూ.. "ఈ సినిమా కథ విన్నప్పుడు మాకే చాలా క్యూరియాసిటీ కలిగింది. ప్రియదర్శి నాకు బిడ్డ లాంటి వాడు, తనతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. గతంలో నేను, ప్రేమ గారు కన్నడలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాం, మళ్ళీ ఇందులో కలిసి నటించడం విశేషం" అన్నారు.

దర్శక నిర్మాతల ధీమా

దర్శకుడు వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ సూచనలు సినిమాకు ప్లస్ అయ్యాయని, సాయికుమార్ గారి సుయోధన పాత్ర సినిమాకు హైలైట్ అని పేర్కొన్నారు. నిర్మాత బోసుబాబు మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో, పక్కా స్క్రిప్ట్‌తో ఈ సినిమాను రూపొందించామని, శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, హీరోయిన్ ద్రిషిక చందర్, నటుడు దేవిప్రసాద్ తదితరులు పాల్గొని సినిమా విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story