Vishwanath and sons: 20 ఏళ్ల మమితా లవ్‌లో 40 ఏళ్ల సూర్య.. ఆకట్టుకుంటున్న ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్

Vishwanath and sons: సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో 40 ఏళ్ల అంతర్జాతీయ పిస్టల్ షూటర్‌గా సూర్య, 20 ఏళ్ల అమ్మాయిగా మమితా బైజు మధ్య సాగే అసాధారణ ప్రేమకథే ఈ చిత్రం. ఈ సినిమా టీజర్ విశేషాలను ఈ స్టోరీలో చదవండి.

Rishvik
Published on: 17 March 2026 5:17 PM IST
Vishwanath and sons Teaser
X

Vishwanath and sons: 20 ఏళ్ల మమితా లవ్‌లో 40 ఏళ్ల సూర్య.. ఆకట్టుకుంటున్న ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్

Vishwanath and sons: 20 ఏళ్ల మమితా లవ్‌లో 40 ఏళ్ల సూర్య.. ఆకట్టుకుంటున్న ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘విశ్వనాథ్ & సన్స్’. తాజాగా ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టీజర్‌లో హీరో సంజయ్ విశ్వనాథ్ ప్రపంచాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి అద్భుతంగా ఆవిష్కరించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ టీజర్‌లో సూర్యని సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రలో చూపించారు. 40 ఏళ్ల వయసులో కూడా తన లక్ష్యం కోసం పోరాడే వ్యక్తిగా సూర్య నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి ప్రేమ, ఎమోషనల్ డెప్త్ కలగలిసిన పాత్రలో సూర్య తన విశ్వరూపం చూపించబోతున్నారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. సూర్య కెరీర్‌లో ఇదొక మైలురాయి లాంటి పాత్ర అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అసాధారణ ప్రేమకథ..

ఈ సినిమాలో కథకు మరో ప్రధాన ఆకర్షణ మమితా బైజు. టీజర్‌లో ఆమె పాత్ర ఎంతో ఉత్సాహంగా, చురుకుగా కనిపిస్తోంది. అయితే, ఈ సినిమాలో ఒక సున్నితమైన పాయింట్‌ను టచ్ చేసినట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల అమ్మాయికి మధ్య పుట్టిన ప్రేమను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి సున్నితమైన అంశాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ వెంకీ అట్లూరికి సిద్ధహస్తుడు అనే పేరుంది. జి.వి.ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. నిమిష్ రవి తన కెమెరా పనితనంతో ప్రతి ఫ్రేమ్‌ను విజువల్ వండర్‌గా మార్చారు. షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. సూర్య-వెంకీ అట్లూరి కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో సూర్య, మమితా బైజులతో పాటు రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.

Rishvik

Rishvik

Next Story