Dhurandhar2: రణవీర్ సింగ్ 'ధురందర్' బాడీ వెనుక అసలు రహస్యం

"'ధురందర్ 2' కోసం రణవీర్ సింగ్ పడ్డ కష్టం మామూలుది కాదు! 40 ఏళ్ల వయసులో 15 కిలోల బరువు తగ్గుతూ, మజిల్ పెంచుతూ ఆయన సాధించిన ఈ 'మెనాసింగ్ లుక్' వెనుక ఉన్న డైట్ ప్లాన్ వర్కవుట్ రహస్యాలను ఈ స్టోరీలో చదవండి.

Ganesh
Updated on: 19 March 2026 4:03 PM IST
Dhurandhar2
X

Dhurandhar2: రణవీర్ సింగ్ 'ధురందర్' బాడీ వెనుక అసలు రహస్యం 

Dhurandhar2: రణవీర్ సింగ్ అంటేనే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. 'ధురందర్' ఫర్ట్ పార్ట్‌లో కండలు తిరిగిన శరీరంతో కనిపించిన రణవీర్, రెండో భాగం కోసం మరింత పవర్‌ఫుల్ అండ్ లీన్ లుక్ కోసం కష్టపడ్డారు. ఎటువంటి షార్ట్ కట్స్ తీసుకోకుండా కేవలం క్రమశిక్షణ, కఠినమైన ఆహార నియమాలతోనే ఈ రూపాన్ని సాధించారని అతని సన్నిహితులు చెబుతున్నారు. రణవీర్ సింగ్ తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా విడుదలైన ‘ధురందర్ 2: ది రివెంజ్’ చిత్రం కోసం ఆయన పడ్డ కష్టం, చేసిన విన్యాసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 40 ఏళ్ల వయసులో 15 కిలోల బరువు తగ్గుతూ, పెరుగుతూ ఆయన సాధించిన ఈ 'మెనాసింగ్ లుక్' వెనుక ఉన్న రహస్యాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ సినిమా కోసం రణవీర్ కేవలం బరువు తగ్గడమే కాదు, మజిల్ కూడా పెంచుకున్నారు. ఈ లుక్ కోసం ముందు ఆయన క్యాలరీ నియంత్రణ, హై-ఇంటెన్సిటీ వర్కవుట్స్ ద్వారా శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించుకున్నారు. తర్వాత తగ్గిన బరువును మళ్లీ కండరాల రూపంలో పెంచుకోవడానికి మజిల్ బిల్డింగ్ వ్యాయామాలు చేశారు. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే సాధ్యమయ్యే ఈ ప్రక్రియను రణవీర్ ఎంతో పట్టుదలతో పూర్తి చేశారని చెబుతున్నారు.

రణవీర్ డైట్ ప్లాన్ ఇదే..

శరీరాకృతిని మలచడంలో వ్యాయామం కంటే ఆహారం 70 శాతం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధురంధర్ లుక్ కోసం రణవీర్ అనుసరించిన డైట్ ఇలా ఉంది..

* కొవ్వు తగ్గించే సమయంలో: చికెన్, చేపలు, గుడ్లు వంటి హై-ప్రోటీన్ ఆహారం తీసుకున్నారు. కార్బోహైడ్రేట్లను పూర్తిగా తగ్గించి, ఫైబర్ కోసం పచ్చని కూరగాయలకు ప్రాధాన్యత ఇచ్చారు.

* మజిల్ బిల్డింగ్ కోసం: బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, నట్స్, సీడ్స్ ద్వారా అందే హెల్తీ ఫ్యాట్స్‌ను ఆహారంలో భాగం చేసుకున్నారు. ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా పండ్లు, డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నారు. తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకున్నారు.

రణవీర్ కండలు తిరిగిన దేహం వెనుక వారానికి ఐదు నుంచి ఆరు రోజుల కఠిన శ్రమ ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కండరాల ఎదుగుదల కోసం స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకున్నారని, కొవ్వును వేగంగా కరిగించడానికి HIIT (High-Intensity Interval Training) వర్కవుట్ చేశారని చెప్పారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్సుల కోసం శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచే వ్యాయామాలను కూడా ఆయన నిత్యం క్రమ శిక్షణతో చేసే వారని వెల్లడించారు.

మీరు ఈ డైట్ ప్లాన్‌‌ను ప్రయత్నించవచ్చా..

రణవీర్ సింగ్ సాధించిన ఈ మార్పు చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతున్నారు. అయితే, నిపుణులు ఇచ్చే సలహా ఏంటంటే.. రణవీర్ వంటి సెలబ్రిటీలు నిపుణులైన కోచ్‌లు, డైటీషియన్ల పర్యవేక్షణలో ఇలాంటి మార్పులు చేస్తారు. కానీ సామాన్యులు అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా పెరగడం వల్ల మెటబాలిజం దెబ్బతినే అవకాశం ఉందని, కాబట్టి, ఏదైనా వ్యాయామం లేదా డైట్ ప్రారంభించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

Ganesh

Ganesh

Next Story