Prabhas New Movie: ఊహించని కాంబో.. ప్రభాస్‌ మరోసారి కొత్త జానర్ ట్రై చేస్తున్నాడా?

Prabhas New Movie: మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ దింజిత్ అయ్యతన్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలుసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం సాధారణ భేటీనా? లేక కొత్త సినిమా కోసం జరిగిందా? అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.

Rishvik
Published on: 11 March 2026 5:56 PM IST
Prabhas New Movie: ఊహించని కాంబో.. ప్రభాస్‌ మరోసారి కొత్త జానర్ ట్రై చేస్తున్నాడా?
X

Prabhas New Movie: ఊహించని కాంబో.. ప్రభాస్‌ మరోసారి కొత్త జానర్ ట్రై చేస్తున్నాడా?

Prabhas New Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 'ది రాజాసాబ్' 2026 సంక్రాంతికి విడుదల కాగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 1940ల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఫౌజీ'లో నటిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', ప్రశాంత్ నీల్‌తో 'సలార్ 2' కూడా లైన్‌లో ఉన్నాయి. తాజాగా మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ దింజిత్ అయ్యతన్‌ను ప్రభాస్ కలుసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగందూర్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సమావేశం సాధారణ భేటీనా? లేక కొత్త సినిమా కోసం జరిగిందా? అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.

మలయాళంలో 'కిష్కింధ కాండం', 'ఏకో' వంటి విభిన్నమైన థ్రిల్లర్ చిత్రాలతో దింజిత్ అయ్యతన్ మంచి గుర్తింపు పొందారు. అలాంటి దర్శకుడు ఉన్నపలంగా రెబల్ స్టార్ ప్రభాస్‌ను కలవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ డిన్నర్ మీటింగ్‌కు సంబంధించిన ఫోటోను దింజిత్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఆ ఫోటోలో డార్లింగ్ బ్లాక్ కలర్ కుర్తాలో ఎంతో స్టైలిష్‌గా ఉన్నాడు. ప్రభాస్ ఆతిథ్యం ఎంతో హృదయపూర్వకంగా ఉందని, ఆయనతో సాగిన సరదా సంభాషణలు తనకు చాలా ఆనందాన్ని ఇచ్చాయని దింజిత్ పేర్కొన్నాడు. అలాగే ఈ భేటీని ఏర్పాటు చేసిన హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్‌కు కూడా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ సంస్థ డార్లింగ్ ప్రభాస్‌తో కలిసి 'సలార్ 2' సహా వరుసగా మూడు భారీ సినిమాలు నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిర్మాత విజయ్ కిరగందూర్ స్వయంగా ఈ భేటీని ఏర్పాటు చేయడంతో ప్రభాస్ – దింజిత్ అయ్యతన్ కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్ట్ రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం ఇది ప్రేక్షకులకు ఊహించని సర్‌ప్రైజ్ అవుతుంది. వరుసగా యాక్షన్ సినిమాలు చేసిన డార్లింగ్.. తాజాగా ది రాజాసాబ్ సినిమాతో కామెడీ జానర్‌లో సినిమా చేశాడు. దింజిత్ కూడా విభిన్నమైన కథలు ఎంచుకుంటాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ మరోసారి కొత్త జానర్‌లో సినిమా చేయబోతున్నాడా? అనే ఆసక్తి పెరుగుతోంది.

Rishvik

Rishvik

Next Story