Neena Gupta: ఆరుపదుల వయసులో గర్భవతి అయిందా? నేను హ్యాపీ అంటున్న నీనా గుప్తా!
Neena Gupta: ప్రముఖ నటి, దర్శకురాలు నీనా గుప్తా 66 ఏళ్ల వయసులో గర్భవతి అంటూ సోషల్ మీడియాలో వార్తలు ట్రెండింగ్. ఆ వార్తల్లో నిజమెంత? నీనా గుప్తా ఏమన్నారు?
Neena Gupta
Neena Gupta: సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. అందులోనూ సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలకైతే అడ్డూ అదుపూ ఉండదు. ఒక్కోసారి ఆ వార్తల్లో ఉన్న వాళ్లకు కూడా ఆ విషయం తెలీదు. ఇలాంటి వార్తలు వైరల్ అయిన తరువాత వారు ఆశ్చర్యపోయి.. అవునా.. నిజమా! అంటూ ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. కొందరైతే తమ మీద వచ్చిన తప్పుడు వార్తలపై సీరియస్ అయిపోతారు. మరికొందరైతే మీమీద కేసు పెడతాం.. వీడియో లేదా వార్తను వెంటనే తీసేస్తావా లేదా? అని బెదిరింపులకు దిగుతారు. కానీ, కొంతమంది అలాంటి విషయాల్ని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. తాము కూడా నవ్వుకుని ఎంజాయ్ చేస్తారు. వీలయితే ఆ వార్తలో నిజానిజాలు చెబుతారు. ఇదిగో ఇలాంటి ఘటనే ఇప్పుడు చోటు చేసుకుంది.
ప్రముఖ నటి, దర్శకురాలు నీనా గుప్తాకు సంబంధించిన ఒక విషయం ఈ మధ్య బాగా వైరల్ అయింది. ఇటీవల ఆమె రష్మిక పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో బాగా కనిపించాయి. ఆ ఫొటోల్లో నీనా గుప్తా పొట్ట దగ్గర ఎత్తుగా ఉన్నట్టు కనిపించింది. ఇంకేముంది.. వైరల్ కాంటెంట్ మీద రీసెర్చ్ చేసేవారికి.. గాసిప్స్ కుమ్మరించే వారికీ పని దొరికింది. వెంటనే.. నీనా గుప్త గర్భవతి. కావాలంటే చూడండి.. ఇదిగో బేబీ బంప్ అంటూ వార్తలు కుమ్మేశారు. అవి ట్రెండింగ్ గా మారాయి. అలా ఆ మీడియా.. ఈ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ వార్త నీనా గుప్తాకు చేరింది. ముందు ఇక్క ఆ ట్రెండింగ్ పోస్ట్ చూడండి..
తనకే తెలీని విషయాన్ని బయటపెట్టిన వారిని గురించి ఆమె చాలా ఈజీగా తీసుకున్నారు. నాకే తెలియని విషయాన్నీ చెప్పారు. ఇది నిజంగా జరిగితే ఎంత బావుంటుంది? నాకు కావాల్సిందీ అదే అంటూ రెస్పాండ్ అయ్యారు. అలాగే, ఇది నిజం కాదని చెబుతూనే ఫోటో గురించి వివరణ ఇచ్చారు. ఆరోజు తాను ధరించిన చీర కాస్త మందంగా ఉందనీ.. దానితో అది పొట్టదగ్గర ఎత్తుగా కనిపించింది అని చెప్పారు. చీర చేసిన తప్పుకు తనను గర్భవతిని చేశారంటూ నవ్వేశారు నీనా గుప్తా.
పెళ్లికాకుండానే..
నిజానికి నీనా గుప్తా పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యారు. ఇది 1980 సంవత్సరపు మాట. అప్పట్లో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో ఆమె సంబంధంలో ఉన్నారు. ఆ సమయంలో ఆమెకు ఒక బిడ్డ పుట్టింది. కానీ, నీనా గుప్తాను పెళ్లి చేసుకోవడానికి రిచర్డ్స్ అంగీకరించలేదు. దీంతో ఆమె బిడ్డను కాని, పెంచుకున్నారు. ఈ వార్త అప్పట్లో సంచలంగా నిలిచింది. అప్పటి సమాజంలో ఇది వైరల్ గా మారింది. చాలామంది ఆమెను విమర్సించారు. కానీ, సమాజానికి భయపడకుండా ధైర్యంగా బిడ్డను పెంచుకున్నారు.
అదండీ విషయం.. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ వచ్చే సోషల్ మీడియా వార్తలను నమ్మితే ఇలానే ఉంటుంది. సెలబ్రిటీల మీద వచ్చే ఇలాంటి వార్తల్ని నమ్మేముందు.. ట్రెండింగ్ చేసే టప్పుడు.. షేర్లు.. కామెంట్స్ ఇచ్చేముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవడం మంచిది అని ఈ ఘటన చెబుతోంది.




