Mrunal Thakur: బన్నీ-చెర్రీల మూవీస్ లో ఛాన్స్ కొట్టేసిన మృణాల్!

Mrunal Thakur: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మెగా కాంపౌండ్ లో ఐటెం సాంగ్ చేయబోతోంది. రామ్ చరణ్ పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్ లో ఆమె కనిపించనున్నారని టాక్

KVD Varma
Published on: 22 March 2026 6:55 PM IST
Mrunal Thakur: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మెగా కాంపౌండ్ లో ఐటెం సాంగ్ చేయబోతోంది.
X

Mrunal Thakur

Mrunal Thakur: సీతారామం మూవీతో తెలుగులో మెరిసిన మృణాల్ ఠాకూర్ మొదటి సీమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు కొట్టేసింది. తరువాత నానీతో హాయ్ నాన్న, విజయ్ తో ఫ్యామిలీ స్టార్, ప్రభాస్ తో కల్కి లో కనిపించినా అమ్మడికి పెద్దగా అవకాశాలు వరుసగా రాలేదు. పెద్ద స్టార్స్ తో మూవీస్ కి దూరంగానే ఉండిపోయింది. అయితే, ఇప్పుడు ఒకేసారి రెండు పెద్ద మూవీస్ లో సందడి చేయనుంది ఈ భామ.

చిత్ర పరిశ్రమలో కొంతమంది నటీమణులకు ఎదో ఒక టైములో దృష్టం కలిసి వస్తుంది. ప్రస్తుతం నటి మృణాల్ ఠాకూర్ అలాంటి స్వర్ణయుగంలో ఉన్నారు. ఇప్పటివరకు మీడియం-బడ్జెట్ చిత్రాలలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అందాల భామ, ఇప్పుడు టాలీవుడ్‌లోని అతిపెద్ద స్టార్ నటుల సినిమాల్లో /కనిపించబోతున్నారు. అల్లు అర్జున్, దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో ఓ కీలకమైన రోల్ లో మృణాల్ కనిపించబోతున్నారట. అలాగే రామ్ చరణ్ ' పెద్ది' సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేయనున్నట్టు తెలుస్తోంది.

'పుష్ప 2' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అట్లీతో ఒక కొత్త సినిమా చేస్తున్నారని అందరికీ తెలిసిందే. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మృణాల్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మృణాల్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఇది మృణాల్ కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయి కానుంది. ఇది కాకుండా, మృణాల్ ఠాకూర్ రామ్ చరణ్ చిత్రం 'పెద్ది'లో అభిమానులకు కిక్ ఇవ్వబోతోందట. అవును, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ చిత్రం 'పెద్ది'లో మృణాల్ ఒక ప్రత్యేక పాటలో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ తో కలిసి మృణాల్ స్టెప్పులేయబోతున్నారట. ఇప్పటికే పెద్ది మూవీ సాంగ్స్ ఎంత సంచలనం సృష్టించాయి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈ మూవీలో కనిపిస్తోంది అంటే.. ఆ సాంగ్ కూడా సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు.

'పెద్ది' గ్రామీణ క్రీడలు, రాజకీయాల నేపథ్యంలో సాగే కథ. ఈ చిత్రంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇంతవరకూ మృణాల్ ఒక ప్రత్యేక పాటలో నటించడానికి అంగీకరించడం ఇదే మొదటిసారి. ఈ పాటలో ఆమె రామ్ చరణ్, జాన్వీ ఇద్దరితోనూ తెరను పంచుకోనుంది.

స్టార్ హీరోయిన్లు తమ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు స్పెషల్ సాంగ్స్‌లో కనిపించడం సర్వసాధారణం. సమంత 'పుష్ప'లో, పూజా హెగ్డే 'కూలీ'లో ఐటమ్ సాంగ్ చేసినట్లే, ఇప్పుడు మృణాల్ కూడా 'పెద్ది' మూవీలో ఐటమ్ సాంగ్ చేయనుంది. మరి అమ్మడికి ఈ ఐటెం సాంగ్ స్పెషల్ అవకాశాలు తెస్తుందేమో చూడాలి.

KVD Varma

KVD Varma

Next Story