Lokesh Kanagaraj Remuneration: అల్లు అర్జున్ సినిమా.. లోకేష్ కనగరాజ్‌కు మైండ్ బ్లాకింగ్ రెమ్యూనరేషన్!

Lokesh Kanagaraj Remuneration: AA23 సినిమా కోసం లోకేష్ కనగరాజ్‌కు నిర్మాతలు ఏకంగా రూ.75 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాదు సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో కూడా ఆయనకు కొంత శాతం షేర్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Rishvik
Published on: 11 March 2026 7:25 PM IST
Lokesh Kanagaraj Remuneration
X

Lokesh Kanagaraj Remuneration: అల్లు అర్జున్ సినిమా.. లోకేష్ కనగరాజ్‌కు మైండ్ బ్లాకింగ్ రెమ్యూనరేషన్!

Lokesh Kanagaraj Remuneration: 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. AA23గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. జనవరిలో అధికారికంగా ప్రకటించబడింది. ఈ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' తర్వాత లోకేష్ ఈ సినిమా చేస్తున్నారు. సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ చర్చకు దారి తీస్తోంది. లోకేష్ తన ప్రత్యేకమైన యాక్షన్ స్టైల్‌తో వరుస హిట్లు అందించడంతో.. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్‌కు నిర్మాతలు ఏకంగా రూ.75 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాదు సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో కూడా ఆయనకు కొంత శాతం షేర్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నిజమైతే దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకునే దర్శకులలో లోకేష్ ఒకరిగా నిలవడం ఖాయం.

లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కూలీ’ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఆయన ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంచి ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రంకు సంగీతం అందిస్తున్న మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ కూడా భారీ పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయనకు దాదాపు రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశముందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ వీడియోకు అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం మ్యూజిక్‌తోనే సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చిన అనిరుధ్.. ఈ చిత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకురానున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోయే ఈ భారీ ప్రాజెక్ట్‌పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి.

Rishvik

Rishvik

Next Story