Monalisa Bhosle Dating: యువకుడితో ప్రేమాయణం.. కేరళ పోలీస్ స్టేషన్‌లో ‘కుంభమేళా వైరల్ బ్యూటీ’ మోనాలిసా!
Monalisa Bhosle Dating: కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా భోస్లే ఊహించని షాక్ ఇచ్చారు. ప్రేమ వ్యవహారం కారణంగా కేరళలోని తిరువనంతపురం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
Monalisa Bhosle Dating: యువకుడితో ప్రేమాయణం.. కేరళ పోలీస్ స్టేషన్‌లో ‘కుంభమేళా వైరల్ బ్యూటీ’ మోనాలిసా!
Monalisa Bhosle Dating: మోనాలిసా భోస్లే'.. ఆ మధ్య ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ.. మోనాలిసా అందరి దృష్టిని ఆకర్షించారు. డస్కీ స్కిన్, తేనె కళ్లు, స్వచ్ఛమైన చిరునవ్వుతో యూత్‌ను మదిని దోచేశారు. దాంతో మహా కుంభమేళాకు వెళ్లిన భక్తులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు.. ఫొటోస్, ఇంటర్వ్యూ కోసం మోనాలిసా వెంటపడ్డారు. దాంతో ఆమె ‘కుంభమేళా వైరల్ బ్యూటీ’గా దేశం మొత్తం తెలిసిపోయారు. ఆ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమెతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అనివార్య కారణాలతో ఆ సినిమా ఆదిలోనే ఆగిపోయింది.
తెలుగులో కూడా కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా భోస్లేను హీరోయిన్‌గా లాంచ్ చేస్తూ.. ‘లైఫ్’ అనే సినిమా ప్రారంభమైంది. గతేడాది నవంబర్లో సాయి చరణ్ హీరోగా ఈ సినిమాను ప్రారంభించారు. ఓవైపు సినిమాతో బిజీగా ఉన్న మోనాలిసా.. ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రేమ వ్యవహారం కారణంగా కేరళలోని తిరువనంతపురం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం.. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో గత ఏడాదిన్నరగా మోనాలిసా ప్రేమలో ఉన్నారు. ఫేస్‌బుక్ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడి. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఇద్దరూ డేటింగ్‌లో చేస్తున్నారట. తరచూ కలుస్తున్నారట.
అయితే ఈ ప్రేమ వ్యవహారాన్ని మోనాలిసా భోస్లే తల్లిదండ్రులు తిరస్కరించారు. కుటుంబ సభ్యులు ఆమె ప్రేమను ఒప్పుకోకపోవడంతో.. ప్రియుడి కోసం కేరళ వచ్చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ కలిసి తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించారు. మోనాలిసాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని మహేశ్వర్ గ్రామం. ప్రేమా కోసం తల్లిదండ్రుల కళ్లుగప్పి అక్కడి నుంచి తిరువనంతపురం వచ్చారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ వ్యవహారంపై వివరాలు సేకరిస్తున్నారు. ఇరు కుటుంబాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.




