Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాచీల కలెక్షన్ విలువెంతో తెలుసా?
Jr NTR: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లగ్జరీ వాచ్ కలెక్షన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రూ.7.47 కోట్ల విలువైన రిచర్డ్ మిల్ నుంచి రూ.2.2 కోట్ల రోలెక్స్ వరకు.. తారక్ దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన, అరుదైన వాచీల విశేషాలు, వాటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చదవండి.
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాచీల కలెక్షన్ విలువెంతో తెలుసా?
Jr NTR: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కేవలం నటనతోనే కాదు, తన క్లాస్ అప్పీరియన్స్తోనూ అభిమానులను ఆకట్టుకుంటారు. బయట చాలా సింపుల్‌గా కనిపించినప్పటికీ, తారక్ ధరించే యాక్సెసరీస్ మాత్రం అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌కు వాచీలంటే విపరీతమైన ఇష్టం. షూటింగ్స్ నిమిత్తం విదేశాలకు వెళ్లినప్పుడు అరుదైన, లగ్జరీ వాచీలను సేకరించడం ఆయనకు ఒక హాబీ.
కోట్లలో ఉండే టాప్ బ్రాండ్లు:
ఎన్టీఆర్ దగ్గర ఉన్న వాచీల కలెక్షన్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన బ్రాండ్లైన రిచర్డ్ మిల్ (Richard Mille), పాటెక్ ఫిలిప్ (Patek Philippe), రోలెక్స్ (Rolex) వంటి బ్రాండ్లకు సంబంధించిన లిమిటెడ్ ఎడిషన్ వాచీలు ఆయన వద్ద ఉన్నాయి. ఆయన ధరించే ఒక్కో వాచ్ విలువ సుమారు రూ.2 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. తారక్ దగ్గర ఉన్న వాచీల కలెక్షన్ మొత్తం విలువ దాదాపు రూ.13 కోట్లకు పైగానే ఉంటుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. కేవలం బ్రాండ్ కోసమే కాకుండా, ఆ వాచీలలో ఉండే క్వాలిటీ, అత్యాధునిక డిజైన్, వాటి ప్రత్యేకతలను బట్టే ఎన్టీఆర్ వాటిని ఎంచుకుంటారట. అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయన చేతికి ఉండే వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది. లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ బ్రాండ్లు ఎన్టీఆర్ స్టైల్ స్టేట్మెంట్ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం తారక్ వాచీలకు సంబంధించిన ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.




