PVRINOX: బాక్సాఫీస్ వద్ద 'ధురందర్' సునామీ.. స్టాక్ మార్కెట్‌లో పీవీఆర్ ఐనాక్స్ జోరు

"బాక్సాఫీస్ వద్ద 'ధురందర్ 2' వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో షారుఖ్ ఖాన్ 'జవాన్' రికార్డులను బద్దలు కొట్టిన రణవీర్ సింగ్ చిత్రం. ఈ సినిమా ఎఫెక్ట్‌తో స్టాక్ మార్కెట్‌లో పీవీఆర్ ఐనాక్స్ షేర్ల జోరు. మొదటి రోజే రూ.100 కోట్ల ఓపెనింగ్స్ సాధ్యమేనా? పూర్తి వివరాలను ఈ స్టోరీలో చదవండి."

Ganesh
Updated on: 19 March 2026 3:22 PM IST
PVRINOX
X

PVRINOX: బాక్సాఫీస్ వద్ద 'ధురందర్' సునామీ.. స్టాక్ మార్కెట్‌లో పీవీఆర్ ఐనాక్స్ జోరు

Dhurandhar 2:"బాక్సాఫీస్ వద్ద 'ధురందర్ 2' వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో షారుఖ్ ఖాన్ 'జవాన్' రికార్డులను బద్దలు కొట్టిన రణవీర్ సింగ్ చిత్రం. ఈ సినిమా ఎఫెక్ట్‌తో స్టాక్ మార్కెట్‌లో పీవీఆర్ ఐనాక్స్ షేర్ల జోరు. మొదటి రోజే రూ.100 కోట్ల ఓపెనింగ్స్ సాధ్యమేనా? పూర్తి వివరాలను ఈ స్టోరీలో చదవండి."

PVRINOX: బాక్సాఫీస్ వద్ద 'ధురందర్' సునామీ.. స్టాక్ మార్కెట్‌లో పీవీఆర్ ఐనాక్స్ జోరు

స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ - బాలీవుడ్ సెన్సేషన్ రణవీర్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. అయితే, విడుదలకు ఒక రోజు ముందే నిర్వహించిన పెయిడ్ ప్రివ్యూలకు సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకు అందరి నుంచి ఊహించని స్పందన లభించింది. విడుదలకు ముందే ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు చూసి ఎగ్జిబిటర్ల నుంచి స్టాక్ మార్కెట్ విశ్లేషకుల వరకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త చరిత్ర..

శాక్‌నిల్క్ నివేదికల ప్రకారం.. ఈ చిత్రం ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది. బుక్‌మైషోలో ఏకంగా 14.81 లక్షల టిక్కెట్లు అమ్ముడవడంతో, గతంలో షారుఖ్ ఖాన్ 'జవాన్' (11.02 లక్షలు) పేరిట ఉన్న రికార్డు కనుమరుగైంది. పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) వంటి దిగ్గజ మల్టీప్లెక్స్ చైన్‌లలో సైతం 10 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. కొన్ని ప్రాంతాలలో ప్రీమియం టిక్కెట్ ధర రూ.2,000 పలుకుతుండటం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.

స్టాక్ మార్కెట్‌లో 'ధురందర్' జోరు

ఈ సినిమా సృష్టించిన హైప్ కేవలం థియేటర్లకే పరిమితం కాలేదు, స్టాక్ మార్కెట్‌పై కూడా సానుకూల ప్రభావం చూపింది. నిన్న (మార్చి 18) పీవీఆర్ ఇనాక్స్ షేర్లు 1.58 శాతం పెరగ్గా, నేడు (మార్చి 19) ఉదయం ట్రేడింగ్‌లో మరో 1 శాతం లాభపడి రూ.1,029.50 వద్ద ట్రేడవుతున్నాయి. సినిమా విజయం మల్టీప్లెక్స్ రంగంలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ చిత్రం మొదటి రోజే రూ.100 కోట్ల ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా టోటల్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ.1,100 కోట్లు నుంచి రూ.1,300 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఫస్ట్ పార్ట్ కేవలం హిందీలోనే రిలీజ్ అవ్వగా, ఈసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా గ్రాండ్‌గా విడుదలవుతోంది.

బ్రాండ్ల క్యూ.. భారీ భాగస్వామ్యాలు

సినిమాపై ఉన్న క్రేజ్ చూసి లోరియల్, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా వంటి సుమారు 70 జాతీయ బ్రాండ్లు, 400 మందికి పైగా ప్రకటనకర్తలు ఈ చిత్రంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దాదాపు 6 కోట్ల మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అంచనా వేయడంతో, మల్టీప్లెక్స్ పరిశ్రమకు ఇది ఒక 'సంజీవని'లా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే మూడు వారాల పాటు ఈ 'ధురందర్' మ్యాజిక్ కొనసాగితే, వచ్చే ఆర్థిక సంవత్సరం (FY27) సినీ పరిశ్రమకు అదిరిపోయే ఆరంభం లభించినట్లే అని అంటున్నారు.

Ganesh

Ganesh

Next Story