Allu Aravind: మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. అల్లు అయాన్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్!

టాలీవుడ్‌లో తిరుగులేని చరిత్ర ఉన్న అల్లు ఫ్యామిలీ నుంచి మరో తరం నటనారంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

Arun Chilukuri
Published on: 13 March 2026 3:37 PM IST
Allu Aravind: మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. అల్లు అయాన్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్!
X

Allu Aravind: మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. అల్లు అయాన్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: టాలీవుడ్‌లో తిరుగులేని చరిత్ర ఉన్న అల్లు ఫ్యామిలీ నుంచి మరో తరం నటనారంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ వెండితెర అరంగేట్రంపై స్వయంగా ఆయన తాత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో సందడి:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తాజాగా 'అల్లు సినిమాస్' స్టూడియో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అల్లు వారసుడి ఎంట్రీపై హింట్ ఇచ్చారు. "అల్లు అయాన్ ఇప్పుడే సినిమాల్లో నటిస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు" అంటూ ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సోషల్ మీడియా స్టార్ అయాన్:

వాస్తవానికి అల్లు అయాన్‌కు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ షేర్ చేసే వీడియోల ద్వారా అయాన్ చేసే అల్లరి, అతని స్టైల్ ప్రేక్షకులకు బాగా తెలుసు. గతంలో అల్లు ఫ్యామిలీకి సంబంధించిన కీలక సందర్భాల్లో మీడియా దృష్టి మొత్తం అయాన్ పైనే నిలిచింది.

సిగ్నల్ ఇచ్చేసిన అరవింద్:

అరవింద్ వ్యాఖ్యలతో అల్లు ఫ్యామిలీ నుంచి మరో స్టార్ పుట్టుకురావడం ఖాయమని మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే అయాన్ ఇప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్‌గా వస్తాడా? లేక శిక్షణ తీసుకున్న తర్వాత హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడా? అనే విషయంపై మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story