HealthTips: జాగ్రత్త! గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే!
HealthTips: మీరు రోజులో 6 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చునే ఉంటున్నారా? అయితే జాగ్రత్త! గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డాక్టర్లు సూచించిన ఈ చిట్కాలతో మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
HealthTips: జాగ్రత్త! గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే!
HealthTips: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో ఆఫీసు పనులైనా, ఆన్‌లైన్ చదువులైనా గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోవడం సర్వసాధారణమైపోయింది. అయితే, కదలకుండా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం అనేది 'సైలెంట్ కిల్లర్'లా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించ వచ్చు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శరీరంపై పడే ప్రభావం ఇదే..
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలను పలువురు వైద్య నిపుణులు వివరించారు. ఎక్కువ సేపు కూర్చోవడం కారణంగా శరీర కదలిక లేకపోవడం వల్ల కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయి. ముఖ్యంగా వెన్నెముకపై ఒత్తిడి పెరిగి తీవ్రమైన వెన్ను, నడుము నొప్పులకు దారితీస్తుంది. కాళ్లు, చేతుల్లో రక్త ప్రవాహం మందగించి తిమ్మిర్లు రావడం లేదా వాపులు రావడం జరుగుతుంది. కేలరీలు సరిగ్గా బర్న్ అవ్వవు, దీనివల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. స్క్రీన్ల వైపు నిరంతరం చూడటం వల్ల చూపు మందగించడం, మానసిక ఒత్తిడికి, చిరాకుకు కూడా కారణమవుతుంది.
హెచ్చరిక సంకేతాలు..
* తరచుగా వచ్చే వీపు, మెడ, నడుము నొప్పి.
* కాళ్లలో భారంగా అనిపించడం లేదా తిమ్మిర్లు రావడం.
* త్వరగా అలసిపోవడం, శక్తి స్థాయిలు తగ్గిపోవడం.
* నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం.
* అకస్మాత్తుగా బరువు పెరగడం.
పరిష్కార మార్గాలు ఇవే..
ఈ సమస్యల నుండి బయటపడటానికి కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి 30 నుంచి 45 నిమిషాలకు ఒకసారి లేచి 5 నిమిషాల పాటు అటు ఇటు నడవడం లేదా శరీరాన్ని స్ట్రెచ్ (Stretch) చేయడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు. కూర్చునేటప్పుడు వెన్నుపూస తిన్నగా ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ స్క్రీన్ మీ కంటి స్థాయిలోనే ఉండాలని చెబుతున్నారు. పుష్కలంగా నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం ముఖ్యం అని సూచిస్తున్నారు. రోజువారీ జీవితంలో యోగా లేదా కనీసం 30 నిమిషాల నడకను భాగం చేసుకోవాలని, వీలైతే 'స్టాండింగ్ డెస్క్'లను ఉపయోగించడం మంచిదని అంటున్నారు. పని ముఖ్యం కానీ, ఆరోగ్యం అంతకంటే ముఖ్యమని, అందుకే ఎక్కువసేపు కూర్చోని పని చేసే వారు.. వారి పని మధ్యలో కొద్దిసేపు నడవడం మర్చిపోకండని సూచిస్తున్నారు.




