Ramzan Wishes 2026: మీ స్నేహితుల‌కు, బంధువుల‌కు రంజాన్ విషెస్ చెప్పాలా.? ఇదిగో బెస్ట్ గ్రీటింగ్స్

Ramzan Wishes 2026: ముస్లింలు ఎంతో ప‌విత్ర‌మైన రంజాన్ మాసాన్ని పూర్తి చేశారు. అత్యంత క‌ఠినంగా ఉప‌వాస దీక్ష‌లు చేప‌ట్టారు. భార‌తకాల‌మాన ప్రకారం శ‌నివారం (మార్చి 21)న ఈద్ ఆల్ ఫిత‌ర్ పండుగ‌ను జ‌రుపుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

Mokshith
Published on: 20 March 2026 4:46 PM IST
Ramzan Wishes 2026
X

Ramzan Wishes 2026: మీ స్నేహితుల‌కు, బంధువుల‌కు రంజాన్ విషెస్ చెప్పాలా.? ఇదిగో బెస్ట్ గ్రీటింగ్స్ 

Ramzan Wishes 2026:ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్. ఈ కాలంలో ఉపవాసం, ప్రార్థనలు, దానం వంటి ఆచారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నెలవంకతో ప్రారంభమయ్యే ఈ పవిత్ర కాలం, భక్తి-నిబద్ధతతో సాగి ఈద్ ఉల్ ఫితర్ పండుగతో ముగుస్తుంది. ఈ సందర్భంలో మీ స్నేహితులు, బంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు పంపేందుకు ఈ ప్రత్యేక సందేశాలు ఉపయోగపడతాయి.

* అల్లా దయ మీ ఇంటిని ఆనందంతో నింపాలని కోరుకుంటూ… రంజాన్ ముబారక్

* ఈ పవిత్ర మాసం మీకు శాంతి, సంతోషం అందించాలి… ఈద్ ముబారక్

* మీ ప్రతి ప్రార్థనకు ఫలితం దక్కాలి… మీ జీవితంలో సంతోషం వెల్లివిరియాలని కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్ష‌లు.

* రంజాన్ ఉపవాసాలు మీ మనసుకు శాంతిని, జీవితానికి దారిని చూపాలని ఆశిస్తూ రంజాన్ శుభాకాంక్ష‌లు.

* ఆ అల్లా ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షిస్తూ.. ఈద్ ముబార‌క్‌.

* ఈద్ పండుగ మీ ఇంటికి కొత్త వెలుగులు తీసుకురావాలని కోరుకుంటున్నాను.

* క్షమాపణ, దానం, ప్రేమ… ఈ మూడు విలువలు మీ జీవితంలో నిలవాలని ఆశిస్తూ.. ఈద్ ముబార‌క్‌.

* మీ కష్టాలు తొలగి ఆనందం చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రంజాన్ శుభాకాంక్ష‌లు.

* ఆ అల్లా మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ.. రంజాన్ శుభాకాంక్ష‌లు.

* ప్రతి రోజు ఉపవాసం మీలో ఓర్పు, కరుణ పెంచి.. మీ కుటుంబంలో సంతోషం, శాంతి నింపాల‌ని ఆశిస్తూ. ఈద్ ముబార‌క్‌.

* ఈద్ రోజు మీ జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతం కావాలి.. అల్లా కృపతో మీ సమస్యలు తొలగి మంచి రోజులు రావాలి.

* “ఈ పవిత్ర రంజాన్ మీ హృదయాన్ని పవిత్రం చేసి, మీ జీవితానికి కొత్త దిశ చూపాలి” అని కోరుకుంటూ. ఈద్ ముబార‌క్‌.

* ఈద్ పండుగ మీ కుటుంబంలో ఆనందాన్ని రెట్టింపు చేయాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ.. రంజాన్ ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు.

Mokshith

Mokshith

Next Story