Health Tips: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. ఉదయాన్నే ఈ 4 పనులు చేస్తే షుగర్ మీ కంట్రోల్‌లో!

Health Tips: రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి మీరు చేసే మొదటి గంట పనులే కీలకం. ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరిచే 4 ముఖ్యమైన ఉదయాన్నే పాటించాల్సిన అలవాట్లు, సరైన అల్పాహారం గురించి ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.

Ganesh
Published on: 16 March 2026 2:10 PM IST
Health Tips: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. ఉదయాన్నే ఈ 4 పనులు చేస్తే షుగర్ మీ కంట్రోల్‌లో!
X

Health Tips: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. ఉదయాన్నే ఈ 4 పనులు చేస్తే షుగర్ మీ కంట్రోల్‌లో!

Health Tips: మధుమేహం ఉన్నవారు లేదా రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా హెచ్చుతగ్గులకు గురయ్యేవారు తమ రోజును ఎలా ప్రారంభిస్తారనేది చాలా ముఖ్యం. నిద్రలేచిన మొదటి గంటలో మనం చేసే పనులు రోజంతా మన జీవక్రియను శాసిస్తాయని పోషకాహార నిపుణురాలు చెబుతున్నారు. ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరచి, షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే ఆ 4 పనులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే ప్రకృతితో కలిసి నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవాలి. ఉదయాన్నే సహజమైన సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. రాత్రిపూట మొబైల్, టీవీ వంటి స్క్రీన్ల వినియోగాన్ని తగ్గించాలని చెబుతున్నారు. ఇలా చేస్తే.. అది కార్టిసాల్ హార్మోన్‌ను నియంత్రించి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందన్నారు.

2. మెంతుల నీరు: ఒక టీస్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇది ఇన్సులిన్ రిలీజ్‌కు తోడ్పడుతుందన్నారు.

దాల్చిన చెక్క నీరు: ఒక కప్పు నీటిలో ఒకటిన్నర టీస్పూన్ సిలోన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకోవాలి. ఇది కణాలు గ్లూకోజ్‌ను బాగా గ్రహించేలా చేస్తుందని చెప్పారు.

3. ఉదయాన్నే కండరాలకు పని చెప్పడం వల్ల రక్తంలోని చక్కెర త్వరగా ఖర్చవుతుంది. దీని కోసం సూర్య నమస్కారాలు, స్క్వాట్స్ (Squats), బ్రిస్క్ వాకింగ్ లేదా మొబిలిటీ వ్యాయామాలు చేయాలన్నారు. ఇలా చేస్తే కండరాలు రక్తం నుంచి గ్లూకోజ్‌ను నేరుగా శక్తిగా వాడుకుంటాయన్నారు. దీనివల్ల భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవని వెల్లడించారు.

4. కేవలం పోహా, టోస్ట్ లేదా బిస్కెట్లు వంటి పిండి పదార్థాలు (Carbs) మాత్రమే తీసుకోకూడదు. మీ అల్పాహారంలో ఇవి కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుడ్లు, పనీర్, పెరుగు లేదా పెసరట్టు. వీటితో పాటు పీచు పదార్థం కోసం కూరగాయలు లేదా సీడ్స్ తీసుకోవాలన్నారు. బాదం, వాల్‌నట్స్ వంటి గింజలు కూడా ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. ఇలాంటి అల్పాహారం వల్ల మధ్యాహ్నం వరకు ఆకలి వేయదని, అలాగే నీరసం కూడా రాదని చెప్పారు.

బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండటం వల్ల కేవలం డయాబెటిస్ తగ్గడమే కాకుండా, మానసిక ఏకాగ్రత, జీవక్రియ ఆరోగ్యం కూడా మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్న మార్పులతో మీ ఆరోగ్యాన్ని సురక్షితం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Ganesh

Ganesh

Next Story