Health Tips: ఈ స‌మ‌స్య‌లున్న వారు పాలు అస్స‌లు తాగ‌కూడ‌దు.. ఏం జ‌రుగుతుందంటే.

Health Tips: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి అని చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం. శరీరానికి అవసరమైన ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు పాలలో సమృద్ధిగా ఉంటాయి.

Mokshith
Published on: 15 March 2026 10:05 AM IST
Health Tips
X

Health Tips: ఈ స‌మ‌స్య‌లున్న వారు పాలు అస్స‌లు తాగ‌కూడ‌దు.. ఏం జ‌రుగుతుందంటే.

Health Tips: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి అని చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం. శరీరానికి అవసరమైన ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు పాలలో సమృద్ధిగా ఉంటాయి. అయితే కొంద‌రికి మాత్రం పాలు తాగితే ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఎవ‌రెవ‌రు పాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలంటే.

పాలు తాగిన తర్వాత గ్యాస్

పాలలో లాక్టోజ్ (Lactose) అనే సహజ చక్కెర ఉంటుంది. ఈ లాక్టోజ్‌ను జీర్ణం చేయడానికి మన శరీరంలో లాక్టేస్ (Lactase) అనే ఎంజైమ్ అవసరం. ఇది చిన్న ప్రేగుల్లో తయారవుతుంది. కొంతమందిలో ఈ ఎంజైమ్ తక్కువగా ఉంటుంది. అప్పుడు లాక్టోజ్ పూర్తిగా జీర్ణం కాకపోవడంతో కడుపులో గ్యాస్ తయారవుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం, కొన్నిసార్లు విరేచనాలు వంటి సమస్యలు కనిపించవచ్చు.

లాక్టోజ్ ఇంటోల‌రెన్స్‌ (Lactose Intolerance) అంటే ఏమిటి?

పాలు లేదా పాల పదార్థాలు తిన్న తర్వాత కడుపు సమస్యలు రావడం లాక్టోజ్ ఇంటోల‌రెన్స్‌ అని అంటారు. పాలు మాత్రమే కాదు పనీర్, లస్సీ, పెరుగు, ఐస్‌క్రీమ్‌తో పాటు ఇత‌ర‌ డెయిరీ పదార్థాలు వంటివి కూడా కార‌ణ‌మ‌వుతాయి. ఈ పరిస్థితిలో శరీరం లాక్టోజ్‌ను సరిగా జీర్ణం చేయలేకపోతుంది. లాక్టోజ్ అసహనం ఉన్నవారిలో కనిపించే లక్షణాలు పాలు తాగిన తర్వాత సాధారణంగా 30 నిమిషాల నుంచి 2 గంటలలోపే కొన్ని లక్షణాలు కనిపించవచ్చు.

కడుపులో గ్యాస్ ఎక్కువగా రావడం, కడుపు ఉబ్బరంగా ఉండటం, కడుపు నొప్పి, విరేచనాలు, వాంతి వస్తున్న‌ట్లు అనిపిస్తుంది. ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే పాలు తగ్గించడం మంచిదని నిపుణులు సూచిస్తారు.

ఎవరెవరికీ పాలు ఎక్కువగా ఇబ్బంది కలిగించవచ్చు?

అందరికీ పాలు తాగితే సమస్య రాదు. కానీ కొన్ని వర్గాల వారికి మాత్రం ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు, తరచుగా గ్యాస్ లేదా ఆమ్లత్వం (Acidity) సమస్య ఉన్నవారు, కడుపు సమస్యలు ఎక్కువగా ఉన్నవారు, వయస్సు పెరిగిన వారు, వయస్సు పెరిగే కొద్దీ కొంతమందిలో లాక్టోజ్‌ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకే పెద్దవారిలో పాలు జీర్ణం కావడం కష్టమవుతుంది. అలాగే పేగుల‌కు సంబంధించిన కొన్ని వ్యాధులు ఉన్నవారికి కూడా పాలు తాగిన తర్వాత సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.

పాలు తాగడం త‌ప్ప‌స‌రా.?

శిశువులకు తల్లి పాలు చాలా ముఖ్యమైనవి. సాధారణంగా పుట్టిన తర్వాత 6 నుంచి 7 నెలల వరకు తల్లి పాలు శిశువుకు ప్రధాన ఆహారంగా ఉంటాయి. అయితే పెద్దవారికి పాలు మాత్రమే ప్రోటీన్‌కు ఒకే మార్గం కాదు. పాలు తాగితే ఇబ్బంది ఉంటే ఇతర ఆహారాల ద్వారా కూడా పోషకాలు పొందవచ్చు. పాల‌కు ప్ర‌త్యామ్నాయంగా పప్పులు,

గుడ్లు, సోయా, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు వంటివి తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్, పోషకాలు అందుతాయి.

Mokshith

Mokshith

Next Story