Dental Care: డెంటిస్ట్‌తో పనిలేదు.. ఈ చిట్కాలతో మీ దంతాలు ముత్యాల్లా మెరిసిపోవడం ఖాయం!
దంతాలపై పసుపు మరకలతో నవ్వడానికి ఇబ్బంది పడుతున్నారా? డెంటిస్ట్‌తో పనిలేకుండా ఇంట్లోనే దొరికే స్ట్రాబెర్రీ, బేకింగ్ సోడా వంటి 4 సహజ సిద్ధమైన వస్తువులతో మీ దంతాలను ముత్యాల్లా ఎలా మెరిపించుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
Dental Care: డెంటిస్ట్‌తో పనిలేదు.. ఈ చిట్కాలతో మీ దంతాలు ముత్యాల్లా మెరిసిపోవడం ఖాయం!
Dental Care: చాలా మందికి చాలా రకాల భయాలు ఉంటాయి. ఉదాహరణకు కొందరికి వాళ్ల తెల్లని దంతాలపై పసుపు మరకలు ఉంటాయి. ఇవి వారిని లోలోపల భయానికి గురి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నవ్వితే ఆ మరకలు చూసి ఎక్కడ తోటివారు నవ్వుతారో, మాట్లాడుతూంటే ఆ పసుపు మరకలు ఎవరైనా చూస్తారేమో అనే ఒక రకమైన ఆత్మన్యూనతాభావంతో ఇబ్బంది పడుతుంటారు. అసలు దంతాలపై పసుపు మరకలు రావడానికి కారణాలు ఏంటి, వాటిని ఎలా దూరం చేసుకోవాలి, ఈ పసుపు మరకల గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, ధూమపానం లేదా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం డెంటిస్టుల చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు ఖర్చు చేసేకంటే, ఇంట్లోనే దొరికే వస్తువులతో మెరిసే తెల్లని దంతాలను ఎలా పొందాలో చదివేయండి.
మెరిసే దంతాల కోసం 4 సహజ చిట్కాలు:
1. స్ట్రాబెర్రీ:
స్ట్రాబెర్రీలు కేవలం రుచికరమైన పండ్లే కాదు, దంతాలను తెల్లగా మార్చడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే మాలిక్ ఆమ్లం, విటమిన్ సి దంతాల పై పొరను శుభ్రం చేస్తాయని చెబుతున్నారు. స్ట్రాబెర్రీలను పేస్ట్‌లా చేసి, దానితో దంతాలను బ్రష్ చేయండి. ఇలా చేయడం వల్ల పసుపు రంగు సులభంగా పోతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
2. బేకింగ్ సోడా & నిమ్మరసం:
బేకింగ్ సోడా ఒక నేచురల్ వైట్నింగ్ ఏజెంట్. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ మొండి మరకలను వదిలిస్తుంది. వీటితో మీ దంతాలపై ఉన్న పసుపు మరకలు ఇట్టే పోతాయని చెబుతున్నారు. అర చెంచా బేకింగ్ సోడాలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి టూత్ బ్రష్‌తో ఒక నిమిషం పాటు మెల్లగా దంతాలను రుద్దండి. దీనిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చేయాలి. ఇలా చేస్తే మీ దంతాలపై ఉన్న పసుపు మరకలు మాయం అవుతాయని చెబుతున్నారు.
3. ఆయిల్ పుల్లింగ్ :
పూర్వ కాలం నుంచి వస్తున్న ఈ పద్ధతి నోటిలోని బ్యాక్టీరియాను తొలగించి దంతాలను మెరిపిస్తుందని అంటున్నారు. ఒక చెంచా కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మివేయండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
4. ఆపిల్ సైడర్ వెనిగర్:
ఇది సహజమైన క్లీనర్లా పనిచేసి పసుపు రంగును తొలగిస్తుందని చెబుతున్నారు. కొద్దిగా వెనిగర్‌ను నీటిలో కలిపి ఆ నీటితో నోటిని శుభ్రం చేసుకోండి. వెనిగర్‌ను నేరుగా దంతాలకు వాడకూడదు, నీటితో కలిపి మాత్రమే వాడాలి. వారానికి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఖరీదైన కెమికల్ ట్రీట్మెంట్స్ కంటే ఈ సహజ సిద్ధమైన చిట్కాలు మీ దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వివరించారు.




