Cooling Hacks: ఇంట్లో కూలర్ ఈ ప్లేస్ లో ఉంచండి.. మంచులో స్విమ్మింగ్ చేసినట్లే..?

Cooler Placement Tips: ఎండాకాలంలో కూలర్ ఉన్నా చల్లని గాలి రాక ఇబ్బంది పడుతున్నారా? సమస్య కూలర్‌లో కాకుండా దాని వాడకం విధానంలో ఉండొచ్చు. సరైన ప్లేస్‌మెంట్, నీరు, ప్యాడ్స్ వంటి అంశాలు కీలకం కూడా చల్లని గాలిపై ఎఫెక్ట్ చూపవచ్చు.

Venkat
Published on: 17 March 2026 1:00 PM IST
Cooling Hacks
X

Cooling Hacks: ఇంట్లో కూలర్ ఈ ప్లేస్ లో ఉంచండి.. మంచులో స్విమ్మింగ్ చేసినట్లే..?

Cooler Placement Tips: కూలర్ పనితీరు ఎక్కువగా అది ఎక్కడ ఉంచారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటే, కూలర్‌ను గదిలోపల ఉంచి వాడవచ్చు పై అంతస్తుల్లో ఉంటే (సూర్యకిరణాలు ఎక్కువగా పడే చోట), కూలర్‌ను కిటికీ దగ్గర లేదా బయట ఉంచాలని చెబుతున్నారు. గది చాలా వేడిగా ఉంటే, కూలర్ వేడి గాలినే తీసుకుని చల్లదనం ఇవ్వలేకపోతుంది.

క్రాస్ వెంటిలేషన్ అవసరం..

కూలర్ బాగా పని చేయాలంటే గాలికి ప్రవేశం, నిష్క్రమణ చాలా బాగుండేలా చూసుకోవాలి. ఒక కిటికీ లేదా తలుపు కొద్దిగా ఓపెన్‌గా ఉంచాలి. గాలి సర్క్యులేషన్ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే కూలర్ గాలి సరిగా తిరుగుతూ చల్లదనం ఎక్కువగా ఇస్తుంది.

సరైన కూలర్ ప్యాడ్స్ ఎంపిక..

చాలామంది కూలర్ ప్యాడ్స్‌ను పట్టించుకోరు. కానీ ఇవే కూలింగ్‌లో కీలకం. ప్యాడ్స్ త్వరగా మురికి అవుతుంటాయి. హనీకాంబ్ ప్యాడ్స్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. వీటి లైఫ్ ఎక్కువ, కూలింగ్ కూడా మెరుగ్గా ఉంటుంది. సమయానికి ప్యాడ్స్ మార్చడం చాలా ముఖ్యం.

ఉప్పునీతో తిప్పలే..

కూలర్‌లో వాడే నీరు కూడా చల్లదనంపై ప్రభావం చూపుతుంది. బోర్ నీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది ప్యాడ్స్, ఫ్యాన్‌పై పొరలా చేరుతుంది. ఫలితంగా కూలర్ పనితీరు తగ్గుతుంది. అందుకే వీలైనంత వరకు మంచినీటిని ఉపయోగించాలి.

పంప్ పనితీరు చెక్ చేయండి..

కూలర్‌లోని పంప్ సరిగా పనిచేయకపోతే, ప్యాడ్స్ తడవవు. ప్యాడ్స్ పూర్తిగా తడుస్తున్నాయా చెక్ చేయాలి. పైపులు బ్లాక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. పంప్ పవర్ సరిగ్గా ఉండా లేదా చూసుకోవాలి. ఈ చిన్న విషయాలపై ఫోకస్ చేస్తే కూలర్ నుంచి చల్లని గాలి వస్తుంది.

కూలర్ చల్లగా గాలి ఇవ్వకపోతే కొత్తది కొనాల్సిన అవసరం లేదు. సరైన ప్లేస్‌మెంట్, నీరు, ప్యాడ్స్, వెంటిలేషన్ చూసుకుంటే మీ కూలర్ కూడా ఏసీలా పనిచేస్తుంది.

Venkat

Venkat

Next Story