Chakramuni Plant: ఒక్క మొక్క.. బోలెడన్ని విటమిన్లు! మల్టీవిటమిన్ మొక్క ప్రత్యేకతలు ఇవే

Chakramuni Plant: విటమిన్ల లోపంతో బాధపడుతున్నారా? సప్లిమెంట్ల అవసరం లేకుండా విటమిన్ A, B, C, Dలను అందించే అద్భుతమైన 'చక్రముని' (మల్టీవిటమిన్) మొక్క గురించి తెలుసుకోండి. రక్తహీనతను తగ్గించి, కంటి చూపును మెరుగుపరిచే ఈ మొక్క ఆకుల విశేషాలను ఈ స్టోరీలో చదవండి.

Ganesh
Published on: 15 March 2026 5:09 PM IST
Chakramuni Plant
X

Chakramuni Plant: ఒక్క మొక్క.. బోలెడన్ని విటమిన్లు! మల్టీవిటమిన్ మొక్క ప్రత్యేకతలు ఇవే

Chakramuni Plant: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మనకోసం మనం సమయం కేటాయించుకోవడం సవాలుగా మారింది. దీని ఫలితంగా విటమిన్ల లోపం ఏర్పడి శరీరం లోపలి నుంచి బలహీనపడుతోంది. చేసేది లేక విటమిన్ల కోసం మనం సప్లిమెంట్లను ఆశ్రయించాల్సి వస్తుంది. కానీ విటమిన్ A, B, C, D లోపాలను తీర్చగల అద్భుతమైన మొక్క ఒకటి మన ఇంటి తోటలోనే పెంచుకోవచ్చని మీకు తెలుసా? అదే 'చక్రముని' మొక్క. దీనిని "మల్టీవిటమిన్ మొక్క" అని కూడా పిలుస్తారు. దీని ప్రత్యేకతలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆయుర్వేదంలో దీని ప్రత్యేకత..

చక్రముని శాస్త్రీయ నామం నామసురోపస్ ఆండ్రోజినస్. ఆయుర్వేదం ప్రకారం.. ఇది ఇతర మొక్కల కంటే ఎంతో భిన్నమైనది. దీని ఆకులు స్వల్ప తీపి, వెచ్చని గుణాన్ని కలిగి ఉండి, శరీరంలోని వాత, కఫాలను సమతుల్యం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీన్ని సులభంగా చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చని చెప్పారు.

ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

* విటమిన్ A, B, C, D లకు ఇది సహజ వనరుగా చెబుతున్నారు.

* దీని ఆకులను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, జీర్ణ ఎంజైమ్లు వేగంగా విడుదలయ్యి జీర్ణక్రియ బలపడుతుందన్నారు.

* రక్తహీనతతో బాధపడేవారికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.

* ఇందులో కొవ్వు, కేలరీలు చాలా తక్కువ. ఇది ఆకలిని నియంత్రించడమే కాకుండా శరీరానికి పూర్తి పోషణను అందిస్తుందన్నారు.

* మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పారు.

ఎలా తీసుకోవాలంటే..

చక్రముని ఆకులను నేరుగా పచ్చిగా తినవచ్చు. లేదా వీటిని మన రోజువారీ వంటల్లో కూడా భాగంగా చేసుకోవచ్చన్నారు. పప్పు లేదా సాంబార్లో కూడా వాడవచ్చు. ఈ ఆకులతో రుచికరమైన చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. రోటీ పిండిలో కలిపి కూడా వీటిని వండుకోవచ్చు.

గమనిక: మీరు ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, వీటిని ఆహారంలో చేర్చుకునే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Ganesh

Ganesh

Next Story