Best Hydrating Lip Balms: పెదవులు పొడిబారుతున్నాయా? 7 బెస్ట్ లిప్ బామ్స్ ఇవే!
Best Hydrating Lip Balms: వేసవి ఎండల్లో మీ పెదవులు పొడిబారకుండా ఉండాలా? నిపుణులు సూచించిన 7 బెస్ట్ హైడ్రేటింగ్ లిప్ బామ్స్, వాటి ధరలు, అవి ఎక్కడ దొరుకుతాయో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
Best Hydrating Lip Balms: పెదవులు పొడిబారుతున్నాయా? 7 బెస్ట్ లిప్ బామ్స్ ఇవే!
Best Hydrating Lip Balms: వేసవి ఎండలు మొదలయ్యాయి. ఈ కాలంలో కేవలం ఫేస్ క్రీమ్స్, సన్‌స్క్రీన్ లోషన్లు ఉంటే సరిపోదు, పెదవులను తేమగా ఉంచే మంచి లిప్ బామ్ కూడా చాలా అవసరం. మార్కెట్లో దొరికే వేల ఉత్పత్తుల్లో ఏవి బెస్ట్ అనేది తెలుసుకోవడం కొంచెం కష్టమే. అందుకే నిపుణుల సూచనల ప్రకారం 7 బెస్ట్ హైడ్రేటింగ్ లిప్ బామ్స్ గురించి, వాటి ధరలు, అవి ఎక్కడ దొరుకుతాయో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
1. లేనిజ్ లిప్ గ్లోయీ బామ్ (Laneige Lip Glowy Balm)
తేమను రోజంతా ఉంచడంలో ఇది దిట్ట. ఇది పెదవులపై తేలికగా ఉంటూనే, మంచి మెరుపును ఇస్తుంది. బెర్రీ, గ్రేప్‌ఫ్రూట్ వంటి ఫ్లేవర్లలో లభించే ఇది పెదవులను మృదువుగా మారుస్తుంది. యువతలో క్రేజ్ సంపాదించుకున్న లేనిజ్ (Laneige) లిప్ గ్లోయీ బామ్ దాదాపు రూ.600 నుంచి రూ. 800 మధ్య లభిస్తుంది. ఇది నైకా (Nykaa), మింత్రా (Myntra) వంటి ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది.
2. సెరావీ హీలింగ్ ఆయింట్మెంట్ (CeraVei Healing Ointment)
పగిలిన పెదవులకు ఇది ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఇందులో ఉండే సెరమైడ్స్, హైలురోనిక్ యాసిడ్ పెదవుల సహజ తేమను పునరుద్ధరిస్తాయి. ఈ సెరావీ (CeraVe) హీలింగ్ ఆయింట్మెంట్ ధర రూ.900 నుంచి రూ.1,200 వరకు ఉంటుంది. ఇది అమెజాన్ ఇండియా లేదా ఐహెర్బ్ వంటి అంతర్జాతీయ వెబ్‌సైట్లలో దొరుకుతుంది.
3. సమ్మర్ ఫ్రెడేస్ లిప్ బటర్ బామ్ (Summer Fridays Lip Butter Balm)
ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇది 100% వేగన్ ప్రొడక్ట్. షియా బటర్, మురుమురు సీడ్ బటర్ వంటి సహజ పదార్థాలతో తయారై, పెదవులకు హైడ్రేషన్ అందిస్తుంది. లగ్జరీ ప్రొడక్ట్స్ ఇష్టపడే వారికి సమ్మర్ ఫ్రెడేస్ (Summer Fridays) లిప్ బటర్ బామ్ అద్భుతమైన ఎంపిక. సమ్మర్ ఫ్రెడేస్ బామ్ ధర రూ. 2,200 నుండి రూ. 2,800 మధ్య ఉంది. ఇది ఎక్కువగా అంతర్జాతీయ షిప్పింగ్ లేదా ఇండియాలోని రీసెల్లర్స్ ద్వారా మాత్రమే లభిస్తాయి.
4. రోడ్ పెప్టైడ్ లిప్ ట్రీట్మెంట్ (Rhode Peptide Lip Treatment)
హెయిల్ బీబర్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ లిప్ బామ్, పెదవులను బొద్దుగా (Plump), మృదువుగా ఉంచుతుంది. ఇందులో ఉండే పెప్టైడ్స్ పెదవుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోడ్ (Rhode) పెప్టైడ్ లిప్ ట్రీట్మెంట్ , రోడ్ పెప్టైడ్ బామ్ ధర రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ఉండవచ్చు. ఇది ఎక్కువగా అంతర్జాతీయ షిప్పింగ్ లేదా ఇండియాలోని రీసెల్లర్స్ ద్వారా మాత్రమే లభిస్తాయి. అందుకే దీని ధర ఆ రేంజ్‌లో ఉంటుంది నిపుణులు చెబుతున్నారు.
5. ఆక్వాఫోర్ లిప్ రిపేర్ (Aquaphor Lip Repair)
బడ్జెట్ ధరలో దొరికే బెస్ట్ లిప్ బామ్ ఇది. వాసన లేని (Fragrance-free) ప్రొడక్ట్స్ ఇష్టపడే వారికి ఇది సరైన ఛాయిస్. అత్యంత సెన్సిటివ్ చర్మం ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. బడ్జెట్ ధరలో ఉత్తమ ఫలితాలను ఇచ్చే ఆక్వాఫోర్ (Aquaphor) లిప్ రిపేర్ కేవలం రూ.400 నుంచి రూ. 600 మధ్య లభిస్తుంది. దీనిని అమెజాన్ లేదా ఫార్మసీ వెబ్‌సైట్లలో కొనుగోలు చేయవచ్చు.
6. బర్ట్స్ బీస్ బీస్వాక్స్ లిప్ బామ్ (Burt’s Bees Beeswax Lip Balm)
సహజ సిద్ధమైన తేనె (Beeswax), విటమిన్ Eతో తయారైన ఈ బామ్, పెదవులపై రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే మింట్ ఫ్లేవర్ వేసవిలో చల్లని అనుభూతిని ఇస్తుంది. ఈ బర్ట్స్ బీస్ (Burt’s Bees) బీస్వాక్స్ లిప్ బామ్ రూ.450 నుంచి రూ. 650 మధ్య నైకా, హెల్త్ అండ్ గ్లో స్టోర్లలో అందుబాటులో ఉంది.
7. వాసెలిన్ లిప్ థెరపీ (Vaseline Lip Therapy)
దశాబ్దాలుగా నమ్మకమైన బ్రాండ్ ఇది. లోపలి నుంచి పెదవులను హైడ్రేట్ చేయడంలో వాసెలిన్ రోజీ లిప్స్ లేదా ఒరిజినల్ వేరియంట్స్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ వాసెలిన్ (Vaseline) లిప్ థెరపీ కేవలం రూ.150 నుంచి రూ.250 మధ్యే లభిస్తుంది. ఇది అన్ని లోకల్ కిరాణా షాపులు, మెడికల్ స్టోర్లలో సులభంగా దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు తక్కువ ధరకే వస్తున్నాయని నకిలీ ప్రొడక్ట్స్ బారిన పడకుండా, నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌ల నుంచే ఆర్డర్ చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.




