Vikarabad: ఎవడ్రా మమ్మల్ని ఆపేది? ఇసుక మాఫియా వీరంగం

Vikarabad: బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమ ఇసుక రవాణా తనిఖీలకు వెళ్లిన బషీరాబాద్ ఎస్సై వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ తో ఢీకొట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 March 2026 6:40 PM IST
Vikarabad
X

Vikarabad: ఎవడ్రా మమ్మల్ని ఆపేది? ఇసుక మాఫియా వీరంగం

Vikarabad: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లో పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన ఇసుక ట్రాక్టర్. అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న సమాచారాన్ని తెలుసుకున్న బషీరాబాద్ ఎస్సై తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లి ఇసుక ట్రాక్టర్లను ఆపేందుకు ప్రయత్నించగా సాక్షాత్తు ఎస్సై వాహనాన్ని పట్టపగలు ఢీ కొట్టి మమ్మల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టుగా.. బరితెగించిన ఇసుక మాఫియా సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో చోటుచేసుకుంది.

పోలీస్ వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ తో ఢీ కొట్టిన ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బరితెగించిన ఇసుక మాఫియా పై కేసులు నమోదు చేసేందుకు పోలీసు ఉన్నదా అధికారులు చర్యలు ముమ్మరం చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story