Ranga Reddy: గండిపేట్ తహసీల్దార్ ఆఫీసులో విజిలెన్స్ దాడులు!


Ranga Reddy: గండిపేట్ తహసీల్దార్ ఆఫీసులో విజిలెన్స్ దాడులు!
Ranga Reddy: గండిపేట్ తహసీల్దార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు! భూ రికార్డులు, పాస్‌బుక్కుల జారీలో జాప్యంపై అధికారుల ఆరా.
Ranga Reddy: గండిపేట్ తహసీల్దార్. కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో నిర్వహణ, ఫైళ్ల వ్యవహారం, ప్రజలకు అందిస్తున్న సేవలు, రికార్డుల నిర్వహణపై అధికారులు సమగ్రంగా పరిశీలించారు. ఆదాయ ధృవపత్రాలు, పాస్‌బుక్స్, భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కారం ఆలస్యంపై వివరాలు సేకరించారు. అదేవిధంగా, కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎటువంటి అవకతవకలు, ఆలస్యాలు జరగకుండా పారదర్శకంగా పని చేయాలని సిబ్బందికి విజిలెన్స్ అధికారులు సూచించారు. అవసరమైన రికార్డులను స్వాధీనం చేసుకుని మరింత విచారణ కొనసాగించనున్నట్లు సమాచారం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

