Rajendranagar: హెచ్చరించినా వినలేదని.. రాజేంద్రనగర్‌లో భవనాలను కూల్చేసిన అధికారులు!

Rajendranagar
x

Rajendranagar: హెచ్చరించినా వినలేదని.. రాజేంద్రనగర్‌లో భవనాలను కూల్చేసిన అధికారులు!

Highlights

Rajendranagar: రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్ గ్రామంలో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారుల భారీ కూల్చివేతలు!

రాజేంద్రనగర్: సర్కిల్ పరిధిలో అనుమతి లేని నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝుళిపించారు. సర్కిల్ పరిధిలోని బుద్వేల్ గ్రామం టీచర్స్ కాలనీలో అక్రమ నిర్మాణాలపై జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన అదనపు అంతస్తులను గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన భవన యజమానులకు ముందుగా నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో అధికారులు కూల్చివేతలు నిర్వహించారు. కొంచెం సమయం లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగాయి.

అక్రమ నిర్మాణాలపై ఎలాంటి సడలింపులు ఉండవని అధికారులు స్పష్టం చేస్తూ, భవన నిర్మాణాలకు ముందు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. నగరంలో అనధికార నిర్మాణాలను అరికట్టేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories