Armoor: రాజీ పడినా వదలలేదు.. పదిమందిని పిలిపించి విచక్షణారహితంగా దాడి!

Armoor: నిర్మల్-నిజామాబాద్ బస్సులో సీటు కోసం మొదలైన చిన్న గొడవ ఆర్మూర్ బస్టాండ్‌లో ఉద్రిక్తతకు దారితీసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 March 2026 4:40 PM IST
Armoor
X

Armoor: రాజీ పడినా వదలలేదు.. పదిమందిని పిలిపించి విచక్షణారహితంగా దాడి!

ఆర్మూర్ న్యూస్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ బస్టాండ్ లో సీట్ కోసం మొదలైన చిన్న తగాదా, సామాజిక వర్గానికి దారి తీసింది, సీట్ కోసం ఇద్దరు ప్రయాణికులు రాజీ పడిన గాని, మూడో వ్యక్తి పదిమందిని పిలిపించి దాడి చేయించడం కలకలం సృష్టించింది, నిర్మల్ నుంచి నిజాంబాద్ కు వెళ్తున్న బస్సు సీటు కోసం కర్చీఫ్ వ్యక్తికి, మరి అక్కడ కూసున్న మరో వృత్తిపై గొడవకు దారితీసింది.

బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు నచ్చరు చెప్పడంతో ఇద్దరు వ్యక్తులు అదే సీట్లో పక్క పక్కనే కూర్చున్నారు, అయితే అనంతరం వీరిద్దరి మధ్యన గొడవను గమనించిన మూడవ వ్యక్తి , తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, రెచ్చగొట్టి, ఆర్మూర్ లోని తన అనుచరులకు సమాచారం ఇచ్చారు, బస్సు పెర్కిట్ బస్టాండ్ కు రాగానే సుమారు పదిమంది యువకులు బస్సు లోకి చోర బడి సీట్ కోసం కర్చీఫ్ వేసిన వ్యక్తిపై విచక్షణ రాహితంగా దాడి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story