Amaravati: వైద్యారోగ్య శాఖలో మార్పులు.. కీలక విభాగాలకు కొత్త సారధులు!

Amaravati: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో పలువురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 March 2026 10:09 PM IST
Amaravati
X

Amaravati: వైద్యారోగ్య శాఖలో మార్పులు.. కీలక విభాగాలకు కొత్త సారధులు!

Amaravati: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల ద్వారా కీలక విభాగాల్లో పనుల పురోగతిని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

APSACS ఎండిగా ఉన్న నీలకంఠారెడ్డిని వైద్యారోగ్య శాఖ నుంచి ఉపసంహరించి సాదారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు చేశారు. సౌరబ్ గౌర్ కు ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ప్రా స్ట్రక్చర్ కార్పోరేషన్ వీసి అండ్ ఎండిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

జీ వీరపాండ్యాన్ కు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రెవెన్యూ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు. కె వి ఎన్ చక్రధర్ బాబుకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యాసేవ ట్రస్ట్ సీఈఓగా అదనపు బాధ్యతలు,అలానే రోనంకి గోపాలకృష్ణకు ఆయుష్ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు,APSACS మేనేజింగ్ డైరెక్టర్ గా ఇన్ చార్జ్ బాద్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story