Farming: ఈ పంటను ఒక్కసారి వేస్తే చాలు.. ఏడేళ్ల వరకు డబ్బులే డబ్బులు..!

Lemongrass Farming: సాధారణంగా వ్యవసాయం అంటేనే పెట్టుబడి ఎక్కువ, లాభం తక్కువ అనే భావన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో రైతులు ఏ పంట వేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. కానీ, 'నిమ్మగడ్డి' సాగు ఈ లెక్కలన్నింటినీ మార్చేస్తోంది. సాంప్రదాయ పంటల కంటే భిన్నంగా, మార్కెట్ డిమాండ్‌ను బట్టి సాగు చేస్తే లక్షల్లో సంపాదించవచ్చని ఈ పంట నిరూపిస్తోంది.

Naresh.k
Published on: 17 March 2026 5:28 PM IST
Lemongrass Farming Guide
X

Farming: ఈ పంటను ఒక్కసారి వేస్తే చాలు.. ఏడేళ్ల వరకు డబ్బులే డబ్బులు..!

Lemongrass Farming: సాధారణంగా వ్యవసాయం అంటేనే పెట్టుబడి ఎక్కువ, లాభం తక్కువ అనే భావన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో రైతులు ఏ పంట వేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. కానీ, 'నిమ్మగడ్డి' సాగు ఈ లెక్కలన్నింటినీ మార్చేస్తోంది. సాంప్రదాయ పంటల కంటే భిన్నంగా, మార్కెట్ డిమాండ్‌ను బట్టి సాగు చేస్తే లక్షల్లో సంపాదించవచ్చని ఈ పంట నిరూపిస్తోంది.

ఎందుకు నిమ్మగడ్డి?

నిమ్మగడ్డి కేవలం ఒక గడ్డి జాతి మొక్క మాత్రమే కాదు.. ఇది ఒక నిత్యవసర సుగంధ తైల భాండాగారం. ఈ గడ్డి నుంచి తీసే నూనెకు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. సబ్బులు, పౌడర్లు, క్రీములు, లోషన్ల తయారీలో ఎక్కువగా దీన్ని వినియోగిస్తారు. అలాగే నొప్పి నివారణ మందులు, యాంటీ సెప్టిక్ తయారీలో పర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెషనర్స్ మరియు డిటర్జెంట్లలో దీని వాడకం ఎక్కువుగా ఉంటుంది.

సాగుకు అనుకూలమైన పరిస్థితులు

నిమ్మగడ్డి సాగులో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీనికి సారవంతమైన భూమి ఉండాల్సిన పనిలేదు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, బంజరు భూముల్లో కూడా ఇది ఏపుగా పెరుగుతుంది.దీనికున్న ఘాటైన వాసన వల్ల పశువులు గానీ, అడవి పందులు గానీ ఈ పంట జోలికి రావు. పెట్టుబడి ఒకసారి.. లాభం ఏడేళ్లు: ఒక్కసారి నాటితే చాలు, ఏడు సంవత్సరాల వరకు వరుసగా కోతలు కోయవచ్చు. ఏడాదికి కనీసం 3 నుంచి 4 సార్లు పంట చేతికి వస్తుంది.

ఆదాయం లెక్కలు ఇలా..

మీరు ఒక హెక్టారు భూమిలో నిమ్మగడ్డి సాగు చేస్తే, ఏడాదికి సుమారు రూ. 4 లక్షల వరకు నికర లాభం పొందే అవకాశం ఉంది. గడ్డి నుంచి మంచి సువాసన వస్తున్నప్పుడు అది కోతకు సిద్ధమైందని గుర్తించాలి. గడ్డిని ఎండబెట్టి పొడి రూపంలో అమ్మవచ్చు. కానీ, పంట దగ్గరే ఒక చిన్న ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే లాభం రెట్టింపు అవుతుంది. మార్కెట్‌లో నిమ్మగడ్డి నూనె లీటరుకు రూ. 1200 నుంచి రూ. 1500 వరకు పలుకుతోంది.

ఫిబ్రవరి నుంచి జూలై నెలల మధ్య ఈ పంటను నాటడానికి అత్యంత అనుకూల సమయం. ఈ సమయంలో నాటితే మొక్కలు త్వరగా వేర్లు తొడిగి, ఏపుగా పెరుగుతాయి. పెద్దగా క్రిమిసంహారక మందుల అవసరం ఉండదు కాబట్టి సాగు ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.కష్టం నీది.. లాభం నీది అన్నట్టుగా, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ స్థిరమైన ఆదాయం పొందాలనుకునే రైతులకు నిమ్మగడ్డి సాగు ఒక చక్కని ప్రత్యామ్నాయం. తక్కువ నీరు, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలనుకునే వారు ఇప్పుడే ఈ దిశగా అడుగులు వేయడం మంచిది.

Naresh.k

Naresh.k

Next Story