Urine: మూత్రం ధార బలహీనంగా వస్తోందా.? ఈ వ్యాధి లక్షణం కావొచ్చు
Urine: మూత్రం పోయడానికి ఎక్కువ సమయం పడటం, ధార బలహీనంగా రావడం లేదా బొట్టులుగా రావడం చాలా మంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ ఈ లక్షణాలు శరీరంలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే తర్వాత పెద్ద ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
Urine: మూత్రం ధార బలహీనంగా వస్తోందా.? ఈ వ్యాధి లక్షణం కావొచ్చు
Urine: మూత్రం పోయడానికి ఎక్కువ సమయం పడటం, ధార బలహీనంగా రావడం లేదా బొట్టులుగా రావడం చాలా మంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ ఈ లక్షణాలు శరీరంలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే తర్వాత పెద్ద ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
మూత్ర ధార బలహీనంగా రావడం అంటే ఏమిటి?
మూత్రం మొదలుపెట్టడానికి ఎక్కువ సమయం పడటం లేదా మూత్రం నెమ్మదిగా రావడం వంటి పరిస్థితిని వైద్య భాషలో యూరినరీ హేసిటెన్సీ అని అంటారు. ఈ సమస్య ఉన్నవారికి మూత్రం చేయాలనే భావన వచ్చినప్పటికీ వెంటనే ప్రారంభం కావడం కష్టం అవుతుంది. కొన్ని సందర్భాల్లో మూత్రం బొట్టులుగా వస్తుంది. ఈ సమస్య ఏ వయసులోనైనా కనిపించవచ్చు. అయితే వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?
మూత్ర ధార బలహీనంగా రావడం మొదట్లో చిన్న సమస్యలా అనిపించవచ్చు. అందుకే చాలామంది దీనిని పట్టించుకోరు. కానీ కాలక్రమేణా పరిస్థితి తీవ్రమవుతుంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తి పూర్తిగా మూత్రం చేయలేని స్థితి వస్తుంది. దీనిని యూరిన్ రిటెన్షన్ అంటారు. ఇది అత్యవసర వైద్య చికిత్స అవసరమైన పరిస్థితి. అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
ప్రోస్టేట్ గ్రంథి పెరగడం
పురుషుల్లో ఈ సమస్యకు ప్రధాన కారణం బెనైన్ ప్రోస్టేట్ హైపర్‌ప్లాసియా (BPH). వయసు పెరిగేకొద్దీ ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది. ఇది యూరేత్రా దగ్గర ఉండటం వల్ల మూత్ర మార్గాన్ని ఒత్తిడి చేస్తుంది. దీంతో మూత్రం ధార బలహీనంగా రావడం లేదా నెమ్మదిగా వస్తుంది. సాధారణంగా 45 సంవత్సరాల పైబడిన పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
అండర్ యాక్టివ్ బ్లాడర్ సమస్య
కొన్ని సందర్భాల్లో మూత్రాశయం (బ్లాడర్) సరిగ్గా పనిచేయకపోవచ్చు. దీనిని అండర్ యాక్టివ్ బ్లాడర్ అంటారు.
ఈ పరిస్థితిలో బ్లాడర్ పూర్తిగా సంకోచించదు. దీంతో మూత్రం పూర్తిగా బయటకు రాదు. కొంత మూత్రం బ్లాడర్‌లోనే మిగిలిపోతుంది. ఈ సమస్యకు నరాలకు సంబంధించిన సమస్యలు, డయాబెటిస్, న్యూరోలాజికల్ వ్యాధులు, వెన్నెముక గాయాలు, బ్లాడర్ అవుట్‌లెట్ అడ్డంకి వంటివి కారణాలుగా చెప్పొచ్చు. కొన్నిసార్లు మూత్రం బయటకు వచ్చే మార్గంలో అడ్డంకి ఏర్పడుతుంది. దీనిని బ్లాడర్ అవుట్‌లెట్ ఆబ్స్ట్రక్షన్ అంటారు.
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
మూత్రం చేయడానికి ఎక్కువ సమయం పడటం, మూత్రం బొట్టులుగా రావడం, మూత్రం పూర్తిగా ఖాళీ కాలేదనే భావన కలగడం, మూత్రం సమయంలో నొప్పి లేదా మంట వంటివి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సమస్యను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుంది. అందుకే మూత్ర ధార బలహీనంగా మారితే దాన్ని చిన్న విషయం అనుకుని నిర్లక్ష్యం చేయకండి.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించాలి.




