Heart Health: హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడా ఏంటో తెలుసా.?

Heart Health: శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది నిరంతరం రక్తాన్ని పంపుతూ శరీరానికి ఆక్సిజన్, పోషకాలు అందిస్తుంది. కానీ గుండె పనితీరులో సమస్యలు వస్తే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. చాలా మంది హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండింటినీ ఒకటే అనుకుంటారు. కానీ ఇవి రెండు వేర్వేరు.

Naresh.k
Published on: 19 March 2026 2:42 PM IST
Heart Health
X

Heart Health: హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడా ఏంటో తెలుసా.? 

Heart Health: శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది నిరంతరం రక్తాన్ని పంపుతూ శరీరానికి ఆక్సిజన్, పోషకాలు అందిస్తుంది. కానీ గుండె పనితీరులో సమస్యలు వస్తే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. చాలా మంది హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండింటినీ ఒకటే అనుకుంటారు. కానీ ఇవి రెండు వేర్వేరు.

హార్ట్ అటాక్ అంటే ఏమిటి?

హార్ట్ అటాక్‌ను వైద్య భాషలో “మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్” అంటారు. ఇది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాకేజ్ ఏర్పడినప్పుడు వస్తుంది. కొలెస్ట్రాల్, ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల రక్తప్రవాహం అడ్డుకుంటుంది.

ఈ ప‌రిస్థితుల్లో చికిత్స ఆలస్యమైతే ప్రమాదం పెరుగుతుంది.

హార్ట్ అటాక్ లక్షణాలు

హార్ట్ అటాక్ ముందు కొన్ని హెచ్చరికలు కనిపిస్తాయి. ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,

చల్లటి చెమటలు, అలసట, తలనొప్పి, వాంతులు లేదా వాంతి వ‌స్తున్న‌ట్లు భావ‌న‌క‌ల‌గ‌డం, మెడ, చేతులు, వెన్ను లేదా దవడలో నొప్పి వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు నెమ్మదిగా వస్తాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు.

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి?

కార్డియాక్ అరెస్ట్ అనేది ఒక్కసారిగా జరిగే అత్యంత ప్రమాదకర పరిస్థితి. గుండె ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో సమస్య వస్తుంది. గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోతుంది. దీంతో రక్తప్రవాహం పూర్తిగా నిలిచిపోతుంది. ఈ పరిస్థితిలో వ్యక్తి వెంటనే స్పృహ కోల్పోతాడు, శ్వాస ఆగిపోతుంది.

రెండింటి మధ్య ముఖ్య తేడాలు

* హార్ట్ అటాక్ ర‌క్త నాళాల్లో బ్లాకేజ్ కార‌ణంగా ఏర్ప‌డుతుంది. అదే కార్డియాక్ అరెస్ట్ విష‌యానికొస్తే గుండె ఎల‌క్ట్రిక‌ల్ లోపం వ‌స్తుంది.

* హార్ట్ అటాక్‌లో ర‌క్త‌ప్ర‌వాహం త‌గ్గుతుంది. కార్డియాక్ అరెస్ట్‌లో గుండె పూర్తిగా ఆగిపోతుంది.

* హార్ట్ అటాక్‌లో ల‌క్ష‌ణాలు ముందుగా క‌నిపిస్తాయి. కార్డియాక్ అరెస్ట్ అక‌స్మాత్తుగా ఆగిపోతుంది.

* హార్ట్ అటాక్ వ‌స్తే చికిత్స‌కు కొంత స‌మ‌యం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ అయితే వెంట‌నే చికిత్సం అందించాల్సి ఉంటుంది.

ఏది ఎక్కువ ప్రమాదకరం?

రెండూ ప్రమాదకరమే అయినప్పటికీ, కార్డియాక్ అరెస్ట్ ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే కొన్ని నిమిషాల్లోనే ప్రాణాపాయం కలుగుతుంది. వెంటనే చికిత్స అందకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

హార్ట్ అటాక్‌లో కొంత సమయం దొరకవచ్చు, కానీ దాన్నీ నిర్లక్ష్యం చేస్తే అది కూడా ప్రాణాంతకమే అవుతుంది.

మొత్తం మీద హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు. లక్షణాలను ముందే గుర్తించడం, వెంటనే వైద్య సహాయం పొందడం ద్వ‌రా ప్రాణాలు కాపాడుకోవ‌చ్చు.

గ‌మ‌నిక‌: పైన పేర్కొన్న వివ‌రాలను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించినంత వ‌ర‌కు వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డమే మంచిది. మ‌రీ ముఖ్యంగా గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.

Naresh.k

Naresh.k

Next Story