Hans India & hmtv Educational Awards 2026: విద్యార్థులకు దిశానిర్దేశం.. విద్యాసంస్థలకు పురస్కారం..

Hans India & hmtv Educational Awards 2026: ఇంటర్ విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్ అదేవిధంగా ఉత్తమ విద్యాసంస్థలకు అవార్డుల ప్రదానోత్సవం మర్చి 28న. పూర్తి వివరాలు ఇవే..

KVD Varma
Updated on: 12 March 2026 9:17 PM IST
Hans India & hmtv Educational Awards 2026
X

Hans India & hmtv Educational Awards 2026

Hans India & hmtv Educational Awards 2026: ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి అయిపోతున్నాయి. తరువాత ఏమి చేయాలి? ఇంటర్మీడియట్ అయిపోయిన వారు తరువాత ఏమి చేయాలి? ఇంజనీరింగా? ప్రొఫెషనల్ స్టడీస్ ఏవైనా చేయాలా? డిగ్రీ చేయాలా? ఏది చేస్తే కెరీర్ మంచి దారిలో వెళుతుంది అనే సందేహాలు. ఇవి ఒక ఎత్తైతే.. ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో చదువు కోవాలి అనే పెద్ద ప్రశ్న. ఎన్నో విద్యాసంస్థలు ఇంటర్మీడియట్ తరువాత ప్రొఫెషనల్ కోర్సులతో పాటు, డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. వాటిలో ఉత్తమమైనవి ఏమిటి? ఏ కాలేజీ బెస్ట్? ఎక్కడ చదువుకుంటే భవిష్యత్ బావుంటుంది?

ఎవరెవరో చెప్పే సలహాలు.. రకరకాల ప్రచారాల హోరు.. వీటి మధ్యలో ఏమి చేయాలో అర్ధం కాక అయోమయ పరిస్థితి. ప్రతి సంవత్సరమూ ఇంటర్ విద్యార్థులకు వచ్చే ఇబ్బందే ఇది.

విద్యార్థులకు వచ్చే ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హన్స్ ఇండియా - హెచ్‌ఎమ్‌టివి సంయుక్తంగా ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా హన్స్ ఇండియా - హెచ్‌ఎమ్‌టివి ఎడ్యుకేషనల్ అవార్డ్స్ - 2026 పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇక్కడ ఇంటర్ (+2) పూర్తి చేసిన విద్యార్థుల కోసం టెక్నికల్- నాన్-టెక్నికల్ ఎడ్యుకేషన్‌పై సుమారు 40 మంది నిపుణులతో ప్రత్యేక కెరీర్ కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు వచ్చే అన్ని సందేహాలకు ఇక్కడ సమాధానం అందివ్వడం జరుగుతుంది.

అంతేకాకుండా, విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉత్తమ విద్యా సంస్థలను గౌరవించేందుకు "హన్స్ ఇండియా" - "హెచ్‌ఎమ్‌టివి" సంయుక్తంగా ఎడ్యుకేషనల్ అవార్డులు కూడా అందించనున్నారు. మార్చి 28వ తేదీన నిర్వహించబోయే ఈ కార్యక్రమ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హన్స్ ఇండియా - హెచ్‌ఎమ్‌టివి ఎడ్యుకేషనల్ అవార్డ్స్ - 2026

కార్యక్రమ వివరాలు:

తేదీ: 28 మార్చి, 2026.

వేదిక: ఆర్టీసీ కళాభవన్, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్.

కార్యక్రమ ముఖ్యాంశాలు:

కెరీర్ కౌన్సెలింగ్: ఇంటర్మీడియట్ (+2) పూర్తి చేసిన విద్యార్థుల కోసం టెక్నికల్- నాన్-టెక్నికల్ ఎడ్యుకేషన్‌పై సుమారు 40 మంది నిపుణులతో ప్రత్యేక కెరీర్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

సమయం: ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు మొత్తం 8 సెషన్లు ఉంటాయి.

అవార్డుల ప్రధానోత్సవం:

హన్స్ ఎడ్యుకేషన్ అవార్డ్స్: మధ్యాహ్నం 12:00 గంటలకు.

హెచ్‌ఎమ్‌టివి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్: సాయంత్రం 5:00 గంటలకు.

ఈ కార్యక్రమం అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ (Apex Educational Services) సహకారంతో.. స్ప్రైపుల్ (Spryple) అసోసియేట్ పార్టనర్‌గా నిర్వహిస్తున్నారు. విద్యా రంగంలో విశేష కృషి చేస్తున్న సంస్థలను ప్రోత్సహించడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశ్యం.






KVD Varma

KVD Varma

Next Story