Swiggy - HDFC Bank: స్విగ్గీ, హెచ్‌డీఎఫ్‌సీ ధమాకా.. కొత్త కార్డులతో ఏడాదికి ₹48,000 ఆదా!

Swiggy - HDFC Bank: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ (Swiggy) మరియు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి.

Arun Chilukuri
Published on: 17 March 2026 4:02 PM IST
Swiggy - HDFC Bank: స్విగ్గీ, హెచ్‌డీఎఫ్‌సీ ధమాకా.. కొత్త కార్డులతో ఏడాదికి ₹48,000 ఆదా!
X

Swiggy - HDFC Bank: స్విగ్గీ, హెచ్‌డీఎఫ్‌సీ ధమాకా.. కొత్త కార్డులతో ఏడాదికి ₹48,000 ఆదా!

Swiggy - HDFC Bank: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ (Swiggy) మరియు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. 2023లో తొలి కో-బ్రాండెడ్ కార్డును విజయవంతంగా నడిపిన ఈ రెండు సంస్థలు, ఇప్పుడు తమ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ 'స్విగ్గీ బ్లాక్' (Swiggy BLCK) మరియు 'స్విగ్గీ ఆరెంజ్' (Swiggy Orange) పేరుతో మరో రెండు కొత్త క్రెడిట్ కార్డులను మార్కెట్లోకి తెచ్చాయి.

ఈ కార్డుల ద్వారా వినియోగదారులు ట్రావెల్ బుకింగ్, ఆన్‌లైన్ షాపింగ్, క్విక్ కామర్స్ మరియు ఫుడ్ డెలివరీ కేటగిరీల్లో ఏడాదికి గరిష్ఠంగా రూ. 48,000 వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

ఏ కార్డుపై ఎంత క్యాష్‌బ్యాక్?

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ రెండు కార్డులను రూపొందించారు. స్విగ్గీ బ్లాక్ (BLCK) కార్డ్: స్విగ్గీలో చేసే కొనుగోళ్లపై ఏకంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. స్విగ్గీ ఆరెంజ్ కార్డ్: స్విగ్గీ లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ట్రావెల్ మరియు షాపింగ్‌పై భారీ ఆఫర్లు:

స్విగ్గీతో పాటు ఇతర ప్రముఖ ప్లాట్‌ఫాంలపై కూడా ఈ కార్డులు అద్భుతమైన డిస్కౌంట్లు అందిస్తున్నాయి.

క్లియర్‌ట్రిప్ (Cleartrip): హోటల్ బుకింగ్స్‌పై 19 శాతం, ఫ్లైట్ బుకింగ్స్‌పై 6 శాతం వరకు డిస్కౌంట్.

నైకా (Nykaa): ఉత్పత్తుల కొనుగోళ్లపై 5 శాతం డిస్కౌంట్ మరియు 5 శాతం క్యాష్‌బ్యాక్.

ఇ-కామర్స్: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా యాప్‌లలో షాపింగ్ చేసినా క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు వర్తిస్తాయి.

దరఖాస్తు ఎలా?

ఈ క్రెడిట్ కార్డుల కోసం రూ. 500 జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వినియోగదారులు స్విగ్గీ మొబైల్ యాప్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దశలవారీగా ఈ కార్డులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థలు వెల్లడించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story