Netflix Layoffs: నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగాల కోత.. డజన్ల కొద్దీ ఉద్యోగులు ఔట్!

Netflix Layoffs: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగాల కోత. అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా 'క్రియేటివ్ స్టూడియోస్' విభాగంపై వేటు వేసిన సంస్థ. మరోవైపు పారామౌంట్ డీల్ నుంచి తప్పుకోవడంపై కో-సీఈఓ టెడ్ సరండోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.

Ganesh
Published on: 13 March 2026 7:24 PM IST
Netflix Layoffs
X

Netflix Layoffs: నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగాల కోత.. డజన్ల కొద్దీ ఉద్యోగులు ఔట్!

Netflix Layoffs: గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తన అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారీ నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ ప్రొడక్ట్ బృందం నుంచి డజన్ల కొద్దీ ఉద్యోగులను తొలగించింది. ముఖ్యంగా మార్కెటింగ్ మెటీరియల్, ట్రైలర్లు, పోస్టర్లను రూపొందించే "క్రియేటివ్ స్టూడియోస్" విభాగంపై ఈ తొలగింపుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

తొలగింపులకు కారణం ఏంటంటే..

ఈ ఉద్యోగ కోతలు ప్రధానంగా ఉద్యోగుల పనితీరు ఆధారంగా జరగలేదని కంపెనీ స్పష్టం చేసింది. సంస్థలో జరుగుతున్న పునర్నిర్మాణం కారణంగా కొన్ని పోస్టులు అవసరం లేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రభావితమైన వారిలో ఎక్కువ మంది డిజైనర్లు, నిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో సుమారు 16,000 మంది ఉద్యోగులు ఉండగా, అందులో 70 శాతం మంది అమెరికా, కెనడాలోనే పనిచేస్తున్నారు. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ తన అగ్ర నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. ఎలిజబెత్ స్టోన్‌కు చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పదోన్నతి లభించగా, మార్టిన్ రోజ్ గ్లోబల్ బ్రాండ్స్ క్రియేటివ్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు.

పారామౌంట్ ఒప్పందంపై వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్..

మరోవైపు, పారామౌంట్ గ్లోబల్ కొనుగోలు రేసు నుంచి నెట్‌ఫ్లిక్స్ తప్పుకుంది. ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సరండోస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారామౌంట్ స్కైడాన్స్ ఆఫర్ చేసిన భారీ మొత్తంతో తాము పోటీ పడలేమని, అందుకే బిడ్డింగ్ నుంచి తప్పుకున్నామని తెలిపారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో ఒప్పందం రద్దు కావడంతో నెట్‌ఫ్లిక్స్‌కు అదనంగా $2.8 బిలియన్ల (సుమారు ₹23,000 కోట్లు) నగదు బ్రేకప్ ఫీజుగా వచ్చింది. పారామౌంట్ అప్పుల ఆర్థిక వ్యూహం హాలీవుడ్‌పై భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సరండోస్ హెచ్చరించారు. పారామౌంట్ కొత్త బాధ్యతలు చేపట్టబోతున్న డేవిడ్ ఎల్లిసన్ వ్యయ నియంత్రణలో భాగంగా వేలాది మందిని తొలగించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. చేతిలో భారీగా నగదు ఉన్నప్పటికీ, అనవసర వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగానే నెట్‌ఫ్లిక్స్ ఈ ఉద్యోగాల కోతలను చేపట్టినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Ganesh

Ganesh

Next Story