DMart Success Story: డీమార్ట్ విజయరహస్యం... రిటైల్ సామ్రాజ్యంగా ఎలా ఎదిగిందో తెలుసా?


DMart Success Story: డీమార్ట్ విజయరహస్యం... రిటైల్ సామ్రాజ్యంగా ఎలా ఎదిగిందో తెలుసా?
DMart Success Story: భారత రిటైల్ రంగంలో నిశ్శబ్దంగా మొదలై, భారీ సామ్రాజ్యంగా ఎదిగిన పేరు డీమార్ట్.
DMart Success Story: భారత రిటైల్ రంగంలో నిశ్శబ్దంగా మొదలై, భారీ సామ్రాజ్యంగా ఎదిగిన పేరు డీమార్ట్. తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు అందించడం అనే సూత్రంతో ముందుకు సాగిన ఈ సంస్థ, తాజాగా దేశవ్యాప్తంగా 500 స్టోర్ల మైలురాయిని చేరుకుని మరో చరిత్ర సృష్టించింది. కేవలం ఇది సంఖ్య కాదు.. 24 ఏళ్ల క్రమశిక్షణ, వ్యూహం, వినియోగదారుల నమ్మకానికి ప్రతిబింబం.
ఒక్కస్టోర్‌తో మొదలై..
2002లో ముంబైలోని పొవాయ్‌లో ఒకే స్టోర్‌తో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు విస్తరించింది. ఈ విజయానికి ప్రధాన కారకుడు వ్యవస్థాపకుడైన రాధాకిషన్ దమానీ అనే చెప్పాలి. స్టాక్ మార్కెట్ రంగంలో తనదైశ శైలిలో విజయం సాధించిన దమానీ...భారత్‌లో నిత్యావసరాలు పెరుగుతున్న నేపథ్యంలో డిమార్ట్‌ను స్థాపించారు. ప్రచారం లేకుండా, నిశ్శబ్దంగా స్థిరంగా ఎదగడం డీమార్ట్ ప్రత్యేకత.
డీమార్ట్ విజయానికి మూల కారణం “తక్కువ ధర – ఎక్కువ ఆదా” అనే మోడల్. ఇతర రిటైల్ స్టోర్లతో పోలిస్తే ఎంఆర్‌పీ కంటే తక్కువ ధరకు సరుకులు అందించడం వల్ల మధ్యతరగతి వినియోగదారుల్లో విశ్వాసం పెరిగింది. ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్లీ రావడం ఈ సంస్థకు పెద్ద బలం. ఒక్క స్టోర్‌తో ప్రారంభమైన ఈ వ్యాపారం నేడు 500 స్టోర్లకు చేరుకుంది.
సొంతబలం
డీమార్ట్ విజయం వెనుక రహస్యం సొంత ప్రాంగణాలు. స్టోర్లను అద్దెకు తీసుకోకుండా సొంతంగా కొనుగోలు చేయడం వల్ల అద్దెఖర్చులు తగ్గుతాయి. దీని నుంచి వచ్చిన లాభాన్ని డిస్కౌంట్ రూపంలో నేరుగా కష్టమర్లకు అందించడం ద్వారా ధరల పోటీలో డీమార్ట్ విజయం సాధించింది. అంతేకాదు, మార్టుకు వచ్చే సరుకులకు సంబంధించిన చెల్లింపులు ఎప్పటికప్పుడే పూర్తి చేయడం కూడా తక్కువ ధరకే నాణ్యమైన సరుకును అందించగలుగుతున్నారు. అంతేకాదు, డీమార్ట్ విస్తరణ కూడా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఒకేసారి దేశవ్యాప్తంగా విస్తరించకుండా ఒక నగరాన్ని ఎంచుకొని అక్కడ స్థిరపడిన తరువాత దానికి సమీప ప్రాంతాల్లో స్టోర్లను తెరుస్తుంది. దీనివలన ట్రాన్స్‌పోర్ట్, సప్లైచైన్ ఖర్చులు తగ్గుతాయి. దాని నుంచి వచ్చిన లాభం తిరిగి వినియోగదారులకు చేరుతుంది. సాధారణంగా సూపర్ మార్కెట్లు షెల్ఫ స్పేస్ కోసం డబ్బులు తీసుకుంటాయి. కానీ, డీమార్ట్ అలాంటి పద్దతులను అనుసరించదు. కష్టమర్లకు అవసరమైన ఎక్కువగా అమ్ముడయ్యే వస్తువులకే ప్రాధాన్యత ఇస్తుంది. సేల్ ముఖ్యం, స్టైల్ కాదు అనే తత్వంతో పనిచేస్తుంది డీమార్ట్. ఈ స్టోర్స్ ద్వారా వేలాదిమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

