Gold Rate Today : బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

Gold Rate Today : మార్చి 22న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వారంలో తులంపై రూ.12 వేలు, కిలో వెండిపై రూ.21 వేల పతనం నమోదైంది.

CR Reddy
Published on: 22 March 2026 7:31 AM IST
Gold Rate Today : బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు
X

Gold Rate Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు నేడు భారీ ఊరట లభించింది. గత వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తుండగా, నేడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన మార్పులు , డాలర్ బలోపేతం కావడం వల్ల దేశీయంగా పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. మార్చి నెల ప్రారంభంలో గరిష్ట స్థాయిలను తాకిన ధరలు, ఇప్పుడు కనిష్ట స్థాయికి చేరుకోవడం విశేషం. గడిచిన ఐదు రోజుల్లో బంగారం ధర ఊహించని విధంగా దిగివచ్చింది. కేవలం ఐదు రోజుల్లోనే తులం (10 గ్రాములు) బంగారంపై సుమారు రూ.12,000 వరకు తగ్గడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. వెండి ధర కూడా ఇదే బాటలో సాగుతూ కిలోపై ఏకంగా రూ.21,000 తగ్గిపోయింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 4,488 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. మార్చి నెలాఖరు నాటికి ఇది 4,000 డాలర్ల మార్కుకు చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) నేడు రూ.1,45,970 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే మార్కెట్ స్థిరంగా ఉన్నప్పటికీ, గత వారం రోజులుగా ఇది భారీ పతనాన్ని మూటగట్టుకుంది.ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.1,33,800 కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద ఉంది. ఢిల్లీ వంటి నగరాల్లో ఇది రూ.2,45,000 వరకు ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పరిస్థితి

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,46,120 కాగా, 22 క్యారెట్లు రూ.1,33,950 గా ఉంది. ముంబై కోల్‌కతాల్లో 24 క్యారెట్ల ధర రూ.1,45,970 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,33,800 వద్ద కొనసాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో బంగారం ధర మిగిలిన నగరాల కంటే కొంచెం ఎక్కువగా రూ.1,56,000 (24 క్యారెట్లు) వద్ద ఉంది.

ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలతో పాటు, అమెరికన్ డాలర్ బలోపేతం కావడం పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం. ముదుపర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించుకుని డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ముడిచమురు ధరలు పెరగడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రాబోయే ఏప్రిల్ నెలలో కూడా ధరలు ఇలాగే తగ్గితే, తులం బంగారం ధర రూ.లక్ష మార్కుకు చేరువ కావచ్చని మార్కెట్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

CR Reddy

CR Reddy

Next Story