Car Offers: కారు కొనుగోలు చేసే వారికి గోల్డెన్ ఛాన్స్..! ఆ మోడళ్లపై రూ.5 లక్షల భారీ డిస్కౌంట్..!

Car Discount India March 2026: కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది మంచి అవకాశం. మార్చి 2026లో దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లు పాత 2024–25 మోడళ్లను క్లియర్ చేయడానికి భారీ డిస్కౌంట్‌లు ప్రకటించాయి. హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ప్రీమియం SUVల వరకు కొన్ని కార్లపై రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది.

Venkat
Published on: 13 March 2026 7:49 AM IST
Car Offers
X

Car Offers: కారు కొనుగోలు చేసే వారికి గోల్డెన్ ఛాన్స్..! ఆ మోడళ్లపై రూ.5 లక్షల భారీ డిస్కౌంట్..!

Car Discount India March 2026: దేశవ్యాప్తంగా అనేక కార్ డీలర్‌షిప్‌లు 2024 మరియు 2025 మోడల్ కార్లను త్వరగా విక్రయించడానికి భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నాయి. దీంతో మార్చి 2026లో ప్రత్యేక ఆఫర్లను కంపెనీలు ప్రకటించాయి. సెప్టెంబర్ 2025లో జరిగిన జీఎస్టీ (GST) మార్పుల తర్వాత చాలామంది వినియోగదారులు కొత్త మోడళ్ల కోసం వేచి ఉండటంతో పాత స్టాక్ డీలర్ల వద్ద అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీలు, డీలర్లతో కలిసి భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

డీలర్‌షిప్‌ల వద్ద పెరిగిన స్టాక్..

రిపోర్టుల ప్రకారం 2025లో కార్ల రిటైల్ డిమాండ్ కంటే డిస్పాచ్‌లు ఎక్కువగా ఉండటంతో డీలర్‌షిప్‌ల వద్ద పాత మోడళ్ల స్టాక్ పెరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) సమాచారం ప్రకారం ప్యాసింజర్ వాహనాల ఇన్వెంటరీ ప్రస్తుతం 27 నుంచి 29 రోజుల మధ్య ఉంది. ఈ క్రమంలో పాత మోడళ్లను త్వరగా విక్రయించడానికి కంపెనీలు ప్రత్యేక డిస్కౌంట్‌లు అందిస్తున్నాయి.

మారుతి, మహీంద్రా కార్లపై మంచి ఆఫర్లు..

కొన్ని ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించాయి.

మారుతి సుజుకి Altoపై సుమారు రూ.1.44 లక్షల వరకు తగ్గింపు ఉంది. Brezzaపై రూ.1.92 లక్షలు, Grand Vitaraపై రూ.1.93 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే Wagon R, Swift, Baleno వంటి ప్రముఖ మోడళ్లపై కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు మహీంద్రా XUV700, Thar Roxx మోడళ్లపై సుమారు రూ.2 లక్షల వరకు తగ్గింపు ఉంది. Scorpio సిరీస్‌పై రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

స్కోడా SUVపై రూ.5 లక్షల భారీ తగ్గింపు..

ఈ ఆఫర్లలో అత్యంత భారీ డిస్కౌంట్ Skoda Kodiaq SUVపై ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌పై కంపెనీ సుమారు రూ.5 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. ఇక Volkswagen Taigunపై రూ.3 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది.

Tata Curvv EVపై రూ.1.71 లక్షలు, Nexon EVపై రూ.1.41 లక్షలు, Punch EVపై రూ.1.20 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే Honda City Hybridపై కూడా సుమారు రూ.2 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

కారు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం..

ఈ ఆఫర్లు కారు కొనాలని భావిస్తున్న వినియోగదారులకు మంచి అవకాశం. కొన్ని మోడళ్లపై 10–15 శాతం వరకు ధర తగ్గడం వల్ల తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కార్లు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ డిస్కౌంట్‌లు డీలర్‌ను బట్టి మారవచ్చు. ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ బోనస్ లేదా స్క్రాప్ పాలసీ ద్వారా అదనపు తగ్గింపులు కూడా పొందే అవకాశం ఉంది.

Venkat

Venkat

Next Story