ఉగాది రోజున నిరుద్యోగులకు మొండిచేయి.. వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం!

నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్సీపీ నేతలు సిద్దంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, అంబటి రవికుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 4:14 PM IST
Banaganapalle
X

ఉగాది రోజున నిరుద్యోగులకు మొండిచేయి.. వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం!

బనగానపల్లె: నంద్యాల జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి స్వగృహంలో వైఎస్సార్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర వైఎస్సార్సీపీ యువజన విభాగం కార్యదర్శి అంబటి రవికుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం, నిరుద్యోగులను దగా చేసిందని వారు విమర్శించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఇప్పుడు కాలయాపన చేస్తూ నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ముచ్చట్లు ముగిశాయని, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగాల భర్తీ కానీ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లిందని, దీనికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story