Nandyala: నంద్యాలలో సేవా పథంలో విష్ణ హాస్పిటల్

Nandyala: నంద్యాల విష్ణ హాస్పిటల్ తొలి వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 24 March 2026 7:55 PM IST
Nandyala
X

Nandyala: నంద్యాలలో సేవా పథంలో విష్ణ హాస్పిటల్

Nandyala: నంద్యాల పట్టణంలోని విష్ణ హాస్పిటల్‌లో తలసేమియా చిన్నారుల కోసం మంగళవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. హాస్పిటల్ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని యాజమాన్యం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా విష్ణ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థోపెడిక్ వైద్యుడు డా. జె. వికాస్ స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. హాస్పిటల్ సిబ్బంది, యువకులు కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని తమ వంతు సేవ అందించారు.

అనంతరం మార్చి 30వ తేదీన నిర్వహించనున్న తలసేమియా చిన్నారుల కోసం ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రూ. 5,560 విలువైన పరీక్షలు మరియు డాక్టర్ల కన్సల్టేషన్‌ను కేవలం రూ. 499కే అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఫండ్ రైజింగ్ ద్వారా సమీకరించిన నిధులను తలసేమియా చిన్నారుల పోషకాహారం, మందులు మరియు ఇతర అవసరాల కోసం వారి కుటుంబాలకు అందజేస్తామని డా. జె. వికాస్ మరియు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.

నంద్యాల బ్లడ్ బ్యాంక్ సెంటర్‌కు చెందిన అచ్యుత్ మాట్లాడుతూ, విష్ణ హాస్పిటల్ నంద్యాలలో సేవా కార్యక్రమాలలో ముందుంటుందని, తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతోందని కొనియాడారు. తలసేమియా చిన్నారుల కోసం చేస్తున్న సేవలకు డా. వికాస్ మరియు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డా. వికాస్, డా. కృష్ణ సాహితీ, డా. వెంకట మనోహర్, హాస్పిటల్ జనరల్ మేనేజర్ కరీం, బ్లడ్ అచ్యుత్, బ్లడ్ ప్రవీణ్ తదితరులు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story